Bigg Boss 7 Telugu: బిగ్‍బాస్ ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం గేమ్.. రసవత్తరంగా ఆట.. మొదట ఫైనల్‍కు వెళ్లేదెవరు? ప్రోమో వీడియో-bigg boss 7 telugu wheel challenge to decide first finalist ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 7 Telugu: బిగ్‍బాస్ ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం గేమ్.. రసవత్తరంగా ఆట.. మొదట ఫైనల్‍కు వెళ్లేదెవరు? ప్రోమో వీడియో

Bigg Boss 7 Telugu: బిగ్‍బాస్ ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం గేమ్.. రసవత్తరంగా ఆట.. మొదట ఫైనల్‍కు వెళ్లేదెవరు? ప్రోమో వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 28, 2023 03:23 PM IST

Bigg Boss 7 Telugu: బిగ్‍బాస్‍లో ఫైనల్‍కు ఎవరు వెళ్లనున్నారో తేల్చడం మొదలుకానుంది. ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం ఓ చాలెంజ్ నేడు జరగనుంది. ఆ వివరాలివే..

Bigg Boss 7 Telugu: బిగ్‍బాస్ ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్.. రసవత్తరంగా ఆట.. మొదట ఫైనల్‍కు వెళ్లేదెవరు?
Bigg Boss 7 Telugu: బిగ్‍బాస్ ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్.. రసవత్తరంగా ఆట.. మొదట ఫైనల్‍కు వెళ్లేదెవరు?

Bigg Boss 7 Telugu: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం 13వ వారం సాగుతుండగా.. ఫైనలిస్టులు ఎవరో తేల్చడం మొదలుకానుంది. ఫైనల్‍కు ముందుగా ఎవరు వెళ్లనున్నారో ఫస్ట్ ఫైనలిస్టును తేల్చేందుకు నేటి (నవంబర్ 28) ఎపిసోడ్‍‍లో ఓ ఛాలెంజ్ జరగనుంది. దీంట్లో గెలిచిన కంటెస్టెంట్ గ్రాండ్ ఫినాలేకు చేరుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వచ్చింది. వివరాలివే..

నామినేషన్ల గురించి శోభా శెట్టి గుర్తు చేసి.. ఇన్ని వారాలు నామినేషన్లు జరగలేదా అనడంతో ప్రోమో షురూ అయింది. అర్జున్ అతి తెలివితేటలు ఏంటో అర్థం కావడం లేదని, ఇంత వంకరగా ఆలోచిస్తాడని అనుకోలేదని శివాజీ అన్నారు. జనాలకు చూపించడానికి పల్లవి ప్రశాంత్ నమ్మక ద్రోహం పదం వాడాడని అమర్ అన్నారు. ఆ తర్వాతే మొదటి ఫైనలిస్టును తేల్చేందుకు వీల్ చాలెంజ్ అనే ఆటను కంటెస్టెంట్లకు బిగ్‍బాస్ పెట్టారు.

ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్ అయ్యే గౌరవాన్ని సంపాదించుకునేందుకు ఒక్క అడుగుదూరంలో ఉన్నారని బిగ్‍బాస్ చెప్పారు. వీలైనంత ఎక్కువ సమయం ఆటలో ఉండేలా చూసుకోవాలని సూచించారు. కంటెస్టెంట్లందరూ స్టూల్ లాంటి ఎత్తైన దానిపై నిలబడగా.. వీల్‍కు ఉన్న పొడవాటి రాడ్ లాంటిది చుట్టూ తిరుగుతుంటుంది. ఆ రాడ్ కాలికి తగలకుండా కంటెస్టెంట్లు టైమింగ్‍తో ఎగురుతూ తప్పించుకోవాలి. కాలికి తగిలితే ఔట్. ఆట నుంచి తప్పుకోవాలి. చివరగా ఆటలో ఉంటే ఓ కంటెస్టెంట్ తొలి ఫైనలిస్టు అవుతారు.

ఈ గేమ్‍లో ముందుగా పల్లవి ప్రశాంత్ ఔటయ్యారు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ, శోభ నిష్క్రమించారు. అనంతరం ప్రశాంత్, శోభ ఈ గేమ్‍కు సంచాలకులుగా వ్యవహరించాలని బిగ్‍బాస్ చెప్పారు. అనంతరం ఈ గేమ్‍లో శివాజీ, యావర్, అమర్ ఔటయ్యారు.

తొలి ఫైనలిస్టు అయ్యేందుకు ఆటలో చివరిగా అంబటి అర్జున్, ప్రియాంక జైన్ పోటీ పట్టారు. అయితే, కాసేపటికే ఒకరు కిందపడినట్టు ప్రోమోలో హింట్ ఇచ్చారు. అయితే, ఎవరు పడిపోయారో మాత్రం చూపించలేదు. ఫినాలే అస్త్రను గెలిచి తొలి ఫైనలిస్టు ఎవరు కానున్నారో నేటి ఎపిసోడ్‍లో తేలనుంది.