Nagarjuna: మా నాన్న కూడా ఊరోడే.. ఇచ్చిపడేశిన నాగార్జున.. ప్రశాంత్, అమర్‌కు ఫీజులు ఔట్
Bigg Boss 7 Telugu Day 47 Promo: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో ప్రతివారం వచ్చి కంటెస్టెంట్ల తీరుపై రివ్యూ ఇచ్చే కింగ్ నాగార్జున తాజా ఎపిసోడ్‌లో అందరికి ఇచ్చిపడేశాడు. దీంతో అవాక్కవడం హౌజ్‌మేట్స్ వంతు అయింది.
Bigg Boss 7 Telugu October 18th Promo: బిగ్ బాస్ 7 తెలుగు ఏడో వారం నామినేషన్స్ హౌజ్ దద్దరిల్లేలా చేసిన విషయం తెలిసిందే. ఈ నామినేషన్లలో కంటెస్టెంట్స్ ప్రవర్తించిన తీరుపై కింగ్ నాగార్జున సీరియస్ అయ్యారు. ఒక్కొక్కరి పేరు చెబుతూ వారి కుండ పగులకొట్టాడు. బిగ్ బాస్ హౌజ్‌లో కుండ బద్దలు కొట్టాల్సిన నిజాలున్నాయంటూ స్టార్ట్ చేసిన నాగార్జున ముందుగా అశ్వినిని లేపాడు. ఎందుకు చేశావమ్మా అలా అని నాగ్ అంటే.. ఏం చేశాను సార్ అని అశ్విని బిక్కమొహం వేసింది.
ఏం చేశావో నీకు తెలీదా.. ఒక్కోసారి నువ్ అనే మాటలు రేయ్.. పోరా అని వస్తున్నాయి అని నాగ్ అన్నాడు. తర్వాత భోలే కుండ పగులగొట్టిన నాగ్ మామ.. మన ఊరిలో, మనం వాడుకునే పదాలు ఉండొచ్చు. ఎర్రగడ్డ అనే పదం ఏ ఫ్లోలో వచ్చిందని ప్రశ్నించాడు. తను సెన్స్ లెస్ అంది సార్ అని భోలే అంటే.. సెన్స్ లెస్ కు, మెంటల్ కి చాలా తేడా ఉంది. నీకు తెలీదా అది అని నాగార్జున అన్నారు. ప్రియాంకను లేపి కొన్నిసార్లు మాటలు అనేసి సారీ చెబితే సరిపోదు అని నాగార్జున చెప్పారు.
అమర్ కేక్ తిన్నప్పుడు బిగ్ బాస్‌కి ఎందుకు ఫిర్యాదు చేయలేదు. ఏంటీ గ్రూపిజమా అని శోభాపై పైర్ అయ్యాడు నాగార్జున. అంత ఆత్రంగా కేక్ తినడం అవసరమా అమర్. నువ్వు చేసిన పని వల్ల ఎంత పెద్ద సమస్యలో ఇరుక్కున్నావో తెలుసా అని నాగ్ అనేసరికి అమర్‌కు మాట రాలేదు. తేజ అందరినీ రెచ్చగొడుతున్నావ్. ఇది ఎక్స్ పెక్ట్ చేయలేదన్నాడు. ప్రశాంత్‌ను లేపి సందీప్ ఒట్టేసినప్పుడు నువ్వెందుకు వేయలేదని ప్రశ్నించాడు నాగ్.
ఒకరి మీద నింద వేసేటప్పుడు నిజమై ఉండాలి. ఇవన్నీ కాదు.. అసలు ఊరోడు అనడం తప్పా. అందరూ ఊరి నుంచే వచ్చారు. అందరికీ తిండి పెట్టేది ఊరే.. నేను గర్వంగా చెబుతున్నాను మా నాన్న ఊరోడు. సగర్వంగా చెబుతున్నా. అందులో తప్పే లేదు అని నాగార్జున అన్నాడు. దీంతో ప్రశాంత్ కాస్తా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇలా అమర్, ప్రశాంత్‌కు ఫీజులు ( అదే.. ఫ్యూజులు) ఎగిరినంత పని అయింది.
టాపిక్