Bigg Boss Elimination: మిస్ యూ డాడీ.. కన్నీళ్లు పెట్టుకున్న శివాజీ.. ఏడిపించేసిన నయని.. నాగార్జున ఎమోషనల్
Bigg Boss 7 Telugu Nayani Pavani: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో మొదటి సారి హౌజ్ మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది. వచ్చిన ఒక వారంలోనే అందరి మనసులు గెలిచిన నయని పావని ఎలిమినేట్ అయి వెళ్లిపోతుంటే.. ఫస్ట్ టైమ్ శివాజీ కన్నీళ్లు పెట్టుకున్నారు. బిగ్ బాస్ 7 తెలుగు అక్టోబర్ 15వ తేది ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?
Bigg Boss 7 Telugu October 15th Episode: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ అంతా ఉల్టా పుల్టానే. కానీ, ఈవారం ఎలిమినేషన్ ఉల్టా పుల్టాగా కాదు చాలా ఎమోషనల్‌గా సాగింది. ఫస్ట్ టైమ్ ఒక కంటెస్టెంట్ కోసం హౌజ్ మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది. హౌజ్‌లోకి అడుగు పెట్టి వారం అయినా మిగతా 13 మంది మనసులను గెలిచింది నయని పావని. ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా.. ఎలా ఉన్నాం, ఎలా ఆడాం అన్నదే పాయింట్ అంటూ తన ఆటతో అందరిని మెప్పించింది. చివరికి ఆమె వెళ్లిపోతూ అందరిని ఎమోషనల్ అయ్యేలా చేసింది.
వెక్కి వెక్కి ఏడుస్తూ
ఎలిమినేషన్ సేవింగ్ ప్రాసెస్‌లో చివరిగా అశ్విని శ్రీ, నయని పావని నిలిచారు. వారిలో నయనికి రెడ్ కార్డ్ చూపించి ఎలిమినేట్ అని చెప్పారు నాగార్జున. దీంతో ఆమె బోరున ఏడవడం మొదలు పెట్టింది. నేను వచ్చింది ఒక వారమే. గేమ్ సరిగ్గా ఆడకముందే పంపిస్తున్నారు. అందుకు బాధగా ఉంది అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. నయనిని శివాజీ దగ్గరికి తీసుకుని ఏడ్వకు తల్లి. ఇక్కడితో అయిపోలేదు కదా. బయటకు వచ్చాక అందరూ కలుస్తారంటూ కన్నీళ్లు తుడిచాడు. గేట్ వరకు వచ్చి పంపించాడు.
అవాక్కయిన నాగార్జున
నయని పావని స్టేజ్‌పైకి వచ్చాకా ఏదొ ఒక ట్విస్ట్ ఉంటుందని హౌజ్ మేట్స్ అనుకున్నారు. కానీ, అదేం లేకుండా నయని జర్నీని ప్లే చేశారు నాగార్జున. తర్వాత హౌజ్‌మేట్స్ ఒక్కొక్కరి గురించి తనకున్న బాండింగ్ చెబుతూ ఎమోషనల్ అయింది నయని. అది వింటూ కంటెస్టెంట్స్ అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. అలా అందరూ ఎమోషనల్ అవుతుంటే నాగార్జున అవాక్కయ్యారు. కాస్తా ఎమోషనల్‌గా మాట్లాడారు. ఆరు రోజుల్లో ఇంతమంది నీ గురించి కన్నీళ్లు పెట్టుకోవడం నీ క్యారెక్టర్ ఏంటో చెబుతుంది. ఇంతమంది ఇలా కనెక్ట్ అవడం నేను ఇంతవరకు చూడలేదు అని నాగ్ అన్నారు.
మిస్ యూ డాడీ
ఇక ప్రత్యేకంగా శివాజీ గురించి చెబుతూ బోరున ఏడ్చింది నయని. శివాజీ మా డాడీ సార్. ఆయన్ను చూస్తేనే నాకు ఏడుపొచ్చేస్తుంది. హౌజ్‌లోకి మొదట వచ్చినప్పుడు ఆయన్ను హగ్ చేసుకోవాలి అనుకున్నా. కానీ, నాకు అంత చనువు ఉందో లేదో తెలియదు. కానీ, రెండు రోజులు గడిచిన తర్వాత నాకు కూతురు లేదు. నన్నే నీ డాడీ అనుకో అన్నారు. మిస్ యూ డాడీ.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను సార్ అంటూ నయని ఏడ్చింది. ఇలా నయని చెబుతుంటే ఎప్పుడూ అంతగా ఏడవని శివాజీ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
జనాల చేతిలో ఉంది
ఆ అమ్మాయి చాలా మంచిది బాబు గారు. తనకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఇంత చిన్న వయసులో అంత కాన్ఫిడెన్స్ ఉన్న అమ్మాయిని నేను చూడలేదు. ఆ వయసులో నేను అలా ఉండేవాడిని కాదు. నాకు చేయి నొప్పి, వెన్ను నొప్పి ఉంది. ఏమైనా అవకాశం ఉంటే నన్ను బయటకు పంపించేయండి సార్ ప్లీజ్. తనను లోపలికి పంపండి అని శివాజీ రిక్వెస్ట్ చేశాడు. కానీ, అది జనాల చేతిలో ఉంది శివాజీ. నేను ఏం చేయలేను అని నాగార్జున చెప్పారు. కానీ, ఈ అమ్మాయి జీవితంలో చాలా పైకి వస్తుంది అంటూ నాగార్జున ఆశీర్వదించి నయని పావనిని పంపించేశారు.
టాపిక్