5000mAh బ్యాటరీతో రూ.20వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే?
బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉండి, చౌక ధరలో స్మార్ట్ ఫోన్ దొరకడం కొంచెం కష్టమే. కనీసం 5000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంటే మెరుగైన ఛార్జింగ్ వెసులుబాటు ఉంటుంది. ఈ జాబితాలో రియల్ మీ, రెడ్ మీ ఫోన్లు ఉన్నాయి. రెడ్ మీ నోట్ 10ఎస్, రియల్ మీ 8ఎస్, మోటోరోలా మోటో జీ9, రియల్ మీ నార్జో 30 లాంటి స్మార్ట్ ఫోన్లు 5000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీ కలిగి ఉన్నాయి.
స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలంటే ఈ రోజుల్లో ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. అయితే చౌక ధరలో, అన్ని ఫీచర్లు ఉండే మొబైల్ ఫోన్ ను తీసుకోవాలంటే తప్పకుండా అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉండి, చౌక ధరలో స్మార్ట్ ఫోన్ దొరకడం కొంచెం కష్టమే. ఎక్కువ సేపు వీడియో రికార్డ్ చేసుకోవాలంటే మెరుగైన బ్యాటరీ సామర్థ్యం అవసరం. ఇందుకోసం డబ్బు కూడా అధికంగా ఖర్చు చేయాలి. మరోపక్క ఎంట్రీ లెవల్ బడ్జెట్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం అంతగా ఉండదు. కనీసం 5000 mAH సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంటే మెరుగైన ఛార్జింగ్ వెసులుబాటు ఉంటుంది. ఈ నేపథ్యంలో రూ.20 వేల లోపు ధరలో 5000 mAH సామర్థ్యం కలిగిన అత్యుత్తమ స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు చూద్దాం.
రెడ్ మీ నోట్ 10ఎస్..
షియోమీ సిరీస్ లో అత్యుత్తమ ఫోన్లలో ఒకటైన రెడ్ మీ నోట్ 10ఎస్ 5000 mAH బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా ఇది 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ను కలిగి ఉంది. దాదాపు ఓ రోజు పాటు ఎలాంటి ఛార్జింగ్ లేకుండా దీన్ని వినియోగించుకోవచ్చు. గంటన్నర సేపు నిరంతరాయంగా గేమ్స్ ఆడుకోవచ్చు, రెండు గంటలపాటు సినిమా చూసినా ఛార్జింగ్ మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎక్కువ సేపు ఉండవచ్చు. రెడ్ మీ నోట్ 10 ఎస్ ఫీచర్ల పరంగానూ అత్యుత్తమంగా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర వచ్చేసి రూ.14,999.
రియల్ మి 8ఎస్..
రియల్ మి ఇటీవలే 8-సిరీస్ లో భాగంగా ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది 5000 ఎంఏహెచ్ సామర్థ్యమున్న బ్యాటరీని కలిగి ఉంది. ఇది కూడా 33 వాట్స్ సామర్థ్యం ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కలిగి ఉంది. ఓ మోస్తరు యూసేజ్ పరంగా ఓ రోజంతా దీన్ని వినియోగించుకోవచ్చు. కొన్ని గంటల పాటు గేమింగ్, నెట్ ఫ్లిక్స్ లో వీడియోలు వీక్షించవచ్చు. రెడ్ మీ నోట్ 10 ఎస్ మాదిరి కాకుండా ఈ ఫోన్ లో 5జీ ఆప్షన్ కూడా ఉంది. మార్కెట్లో ఈ సరికొత్త రియల్ మీ 8ఎస్ స్మార్ట్ ఫోన్ ధర వచ్చేసి రూ.17,999లుగా ఉంది.
రియల్ మీ నార్జో 30..
స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వినియోగించేవారు రియల్ మి నార్జో సిరీస్ ను తప్పకుండా ప్రయత్నించాలి. ఎందుకంటే ఇందులో ఫీచర్లకు కొదవే లేదు. 5000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఇందులోని మరో అదనపు ఆకర్షణ. ముఖ్యంగా బిజీగా ఉన్న రోజు కూడా డౌన్ టైం తర్వాత 15 శాతం బ్యాటరీ మిగిలి ఉంటుంది. రియల్ మి నార్జో 30లో మంచి కెమెరాలు, సినిమాలు చూడటం, గేమింగ్ పరంగా మంచి డిస్ ప్లే ను కలిగి ఉంది. మార్కెట్లో రియల్ మి నార్జో 30 స్మార్ట్ ఫోన్ ధర వచ్చేసి రూ.13,499లుగా ఉంది.
మోటోరోలా మోటో జీ9..
5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉన్న అత్యుత్తమ స్మార్ట్ ఫోన్ల జాబితాలో మోటోరోలా లేకుండా పూర్తి కాదు. మోటో జీ9 స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అంతేకాకుండా ఇది ఓ రోజు సులభంగా ఉంటుంది. మితంగా వినియోగించే వారికి ఈ వెసులుబాటు ఉంటుంది. అయితే అధికంగా ఫోన్ వాడేవారు ఎక్కువ రన్ టైమ్ ను ఆశించకూడదు. మోటో జీ9 ఉన్నతస్థాయి బడ్జెట్ ఫోన్. అంటే పనితీరు పరంగా చూస్తే స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్ ను కలిగి ఉంది. కెమెరాలు కూడా ఇందులో హైలెట్. మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.10,999లకు సొంతం చేసుకోవచ్చు.
సంబంధిత కథనం