Bedurulanka 2012 Pre look: బెదురులంక 2012.. ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ప్రీలుక్‌ రిలీజ్‌ చేసిన కార్తికేయ-bedurulanka pre look released by karthikeya is exciting and interesting ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bedurulanka 2012 Pre Look: బెదురులంక 2012.. ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ప్రీలుక్‌ రిలీజ్‌ చేసిన కార్తికేయ

Bedurulanka 2012 Pre look: బెదురులంక 2012.. ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ప్రీలుక్‌ రిలీజ్‌ చేసిన కార్తికేయ

HT Telugu Desk HT Telugu
Nov 28, 2022 07:39 PM IST

Bedurulanka 2012 Pre look: బెదురులంక 2012 మూవీ నుంచి ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ప్రీలుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశాడు ఈ మూవీ హీరో కార్తికేయ. అంతేకాదు బుధవారం (నవంబర్‌ 30) ఈ మూవీ నుంచి ఫస్ట్‌ లుక్ రిలీజ్‌ కానున్నట్లు కూడా చెప్పాడు.

కార్తికేయ రిలీజ్ చేసిన బెదురులంక 2012 మూవీ ప్రీలుక్ పోస్టర్
కార్తికేయ రిలీజ్ చేసిన బెదురులంక 2012 మూవీ ప్రీలుక్ పోస్టర్

Bedurulanka 2012 Pre look: డిఫరెంట్‌ సబ్జెక్ట్స్‌, టైటిల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు హీరో కార్తికేయ. కమర్షియల్‌గా ఇప్పటి వరకూ అతని సినిమాలు భారీ సక్సెస్‌ అందుకోకపోయినా.. కార్తికేయ మాత్రం ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా బెదురులంక 2012 అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉండటమే కాదు.. ఇప్పుడు ప్రీలుక్‌ పేరుతో రిలీజ్ చేసిన పోస్టర్‌ కూడా ఆసక్తి రేపుతోంది.

ఇందులో కార్తికేయ కేవలం తన రెండు చేతులను మాత్రమే చూపించాడు. ఒక చేతిలో సిగరెట్‌ పట్టుకోగా.. మరో చేతిపై ఉన్న పచ్చబొట్టును చూపించాడు. ఈ పచ్చబొట్టులో రివైండ్‌, ఫార్వర్డ్‌, పాజ్‌, ప్లే బటన్‌లు ఉండటం విశేషం. ఈ సినిమాలో కార్తికేయ సరసన డీజే టిల్లు ఫేమ్‌ నేహా శెట్టి నటిస్తోంది.

ఇక బెదురులంక 2012 మూవీకి ది బిగ్గెస్ట్ హోక్స్‌ ఎవర్‌ ప్లేయ్డ్‌ అనే ట్యాగ్‌ లైన్‌ మరింత ఆసక్తి రేపుతోంది. ఇప్పటి వరకూ ఎప్పుడూ చూడని క్రేజీ సినిమాను మీకు చూపించడానికి ఎంతో థ్రిల్, ఎక్సైటింగ్‌గా ఉన్నాను.. బెదురులంక 2012 ప్రీ లుక్‌ మీకోసం.. ఇక ఫస్ట్‌ లుక్‌ నవంబర్‌ 30, ఉదయం 10.40 గంటలకు మీ ముందుకు తీసుకొస్తున్నాం అని కార్తికేయ చెప్పాడు.

టైటిల్‌, ప్రీలుక్‌తోనే సినిమాపై ఉన్న ఆసక్తిని మేకర్స్‌ పెంచేయగా.. కార్తికేయ తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ క్యాప్షన్‌తో ఆ ఆసక్తిని మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. ఈ సినిమాకు రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. క్లాక్స్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు. మణిశర్మ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. ఈ న్యూఏజ్‌ డ్రామెడీ మూవీపై మేకర్స్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెరకెక్కనుంది.

IPL_Entry_Point

టాపిక్