Bandla Ganesh | ఏది పట్టినా నీకు తిరుగు లేదు దేవర.. పవన్‌పై బండ్లన్న ట్వీట్
పవన్ కల్యాణ్‌పై బండ్ల గణేశ్‌కున్న అభిమానాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సందర్భం వచ్చిన ప్రతిసారి ఆయన పవర్ స్టార్‌పై ఆప్యాయతను చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా హరిహరవీరమల్లు చిత్రం కోసం పవన్ సాధన చేస్తుంటే ఫొటోను చూసి దేవర అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటేనే అభిమానుల సందడి అంతా ఇంతా ఉండదు. ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న పవర్ స్టార్.. చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ మంచి యాక్షన్ ట్రీట్ ఇచ్చారు. అటు రాజకీయాలు, ఇటు సినిమాలు సమతూల్యం చేస్తూ దూసుకెళ్తున్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లాంటి వరుస విజయాల తర్వాత ఆయన నటించే తర్వాతి చిత్రంపై ఆసక్తి నెలకొంది. అదే హరిహరవీరమల్లు. పీరియాడికల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 8 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రాక్టీసులో నిమగ్నమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిత్రబృందం సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంది.
ఈ ఫొటోల్లో పవర్ స్టార్ బల్లేన్ని అతి సునాయాసంగా తిప్పుతూ అదరగొడుతున్నారు. ఈ ఫొటోలను చూసిన ప్రమఖ నిర్మాత బండ్ల గణేశ్ తనదైన శైలిలో పవన్ గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. పవర్ స్టార్‌ను ఆరాధ్యదైవంగా పిలిచే బండ్ల గణేశ్.. ఆయన గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అభిమానాన్ని రెట్టింపుతో చూపిస్తుంటారు. తాజాగా అదే స్థాయిలో ట్విట్టర్ వేదికగా పవర్ స్టార్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. నీకు తిరుగులేదు దేవర అంటూ ట్వీట్ చేశారు.
“గన్ను పట్టినా, పెన్ను పట్టినా, కత్తి పట్టినా, మైకు పట్టినా, ఏది పట్టినా ఎవరిపై గురి పెట్టినా మీకు తిరుగులేదు దేవర" అని తనదైన శైలిలో రాసుకొచ్చారు. ఇప్పటికే పలుమార్లు ఆడియోవేదికలపై పవన్ కల్యాణ్‌పై రెట్టించిన అభిమానాన్ని చాటుకున్నారు బండ్ల గణేశ్. పవన్ అంటే వ్యసనమని, ఈశ్వర పవనేశ్వరా అని, దేవర అని ఇలా రకరకాల పేర్లతో ఆయనను పిల్చుకుంటూ అభిమానంతో ఉప్పొంగిపోతుంటారు. తాజాగా నీకు తిరుగులేదు దేవర అని రాయడంతో పవన్ ఫ్యాన్స్ బండ్ల గణేశ్ ట్వీట్‌కు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు చిత్రంలో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. పీరియాడికల్ యాక్షన్‌గా ఇది తెరెకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇందులో ఎక్కువ పోరాట సన్నివేశాలున్నట్లు తెలుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్