Bajrangi Bhaijaan Munni: బజరంగి భాయ్‍జాన్ ‘మున్ని’ పాప ఇప్పుడు ఎలా ఉందంటే!
Bajrangi Bhaijaan Munni: బజరంగి భాయ్‍జాన్ సినిమాలో మున్నిగా నటించిన హర్షాలి మల్హోత్రా ఇప్పుడు చాలా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ఎలా ఉందో ఇక్కడ చూడండి.
Bajrangi Bhaijaan Munni: సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన బజరంగి భాయ్‍జాన్ సినిమాలో షాహిదా మున్నిగా చేసిన పాప అందరి ప్రశంసలు పొందింది. ఇప్పటికీ ఆ పాప చాలా మందికి గుర్తు ఉంటుంది. ఆ వయసులో ఆమె యాక్టింగ్ స్కిల్క్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ సినిమాలో మున్నిగా చేసిన అమ్మాయి పేరు హర్షాలి మల్హోత్రా. 2015లో వచ్చిన బజరంగి భాయ్‍జాన్ సినిమాలో నటించినప్పుడు హర్షాలి 1వ తరగతి చదువుతుండేది. కాగా, ఇప్పుడు హర్షాలి వయసు 15 సంవత్సరాలు. ఆమె ప్రస్తుతం ఎలా ఉందో ఇక్కడ ఫొటోలు చూడండి. తన ఫొటోలను తరచూ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేస్తుంటుంది హర్షాలి.
సోషల్ మీడియాలో హర్షాలి మల్హోత్రా చాలా పాపులర్. ఇన్‍స్టాగ్రామ్‍లో ఆమెకు ప్రస్తుతం 1.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. తరచూ ఫొటోలు, వీడియోలను ఆమె పోస్ట్ చేస్తూ ఉంటుంది.
హర్షాలీ మల్హోత్రా.. చాలా అందంగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూనే ఉంటారు. సినిమాల్లో మళ్లీ ఎప్పుడు నటిస్తారని ప్రశ్నిస్తుంటారు. కొన్నాళ్ల తర్వాత ఆమె హీరోయిన్‍గా ఎంట్రీ ఇవ్వడం ఖాయమంటూ మరికొందరు రాసుకొస్తుంటారు.
సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన బజరంగి భాయ్‍జాన్ సినిమాలో పాకిస్థాన్‍కు చెందిన మూగ బాలిక మున్ని పాత్రను హర్షాలీ మల్హోత్రా పోషించింది. ఐదేళ్ల వయసులో ఆమె చేసిన నటన అందరినీ మెప్పించింది. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. 2022లో డాక్టర్ అంబేద్కర్ అవార్డును కూడా హర్షాలీ అందుకుంది.
కాగా, బజరంగి భాయ్‍జాన్ చిత్రానికి సీక్వెల్ కూడా రానుంది. ఈ చిత్రంలో హర్షాలీ మల్హోత్రా నటించనుంది. ఈ సినిమా విడుదల కోసం తాను ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హర్షాలీ చెప్పింది.
2015 జూలై 17న విడుదలైన బజరంగి భాయ్‍జాన్ సినిమా భారీ విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్‍ల వర్షం కురిపించింది. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా.. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించాడు. జూలిస్ పకియమ్, ప్రితమ్ సంగీతాన్ని అందించారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ పతాకంపై ఈ చిత్ర నిర్మాణంలోనూ హీరో సల్మాన్ ఖాన్ భాగమయ్యాడు. ఈ చిత్రంలో సల్మాన్ కనబరిచిన విభిన్నమైన నటనకు ప్రేక్షకులు జై కొట్టారు. భావోద్వేగాలు కూడా ఈ సినిమాలో బాగా పండాయి. మొత్తంగా బజరంగి భాయ్‍జాన్ భారీ విజయం సాధించింది. దీనికి సీక్వెల్ కూడా రానుంది.