Shobu Yarlagadda : యంగ్ హీరోపై బాహుబలి ప్రొడ్యూసర్ సెన్సెషనల్ కామెంట్స్.. అతడి గురించేనా?
Shobhu Yarlagadda : శోభు యార్లగడ్డ ఈ పేరు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్లడంతో ఆయన పాత్ర కూడా ఉంది. బాహుబలి సినిమాకు నిర్మాతగా చాలా రిస్క్ చేశారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
బాహుబలి సినిమా(Bahubali)తో.. తెలుగు సినిమా మార్కెట్ ను పెంచారు శోభు యార్లగడ్డ. ఏ ప్రొడ్యూసర్ చేయాలేన్నంత రిస్క్ చేసి సక్సెస్ అయ్యారు. దాదాపు ఆయన వివాదాలకు దూరంగానే ఉంటారు. కానీ తాజాగా ఓ యంగ్ హీరో(Young Hero) మీద మాత్రం చాలా విమర్శలు చేశారు. ఆటిట్యుడ్ కారణంగా మంచి సినిమాను వదులుకున్నాడని ట్వీట్ చేశారు.
సినిమా ఇండస్ట్రీలో గెలుపు ఓటములు సహజం. ఓడిపోతే కొంత మంది డిప్రెషన్‌కు గురవుతారు. గెలిచినప్పుడు ఆనందంగా ఉంటారు. అయితే ఒక్క విజయం సాధించినంత మాత్రాన అహంకారం పెంచుకోవడం అనేది కరెక్ట్ కాదనేది శోభు యార్లగడ్డ(Shobhu Yarlagadda) చెబుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాలే కాదు.., ఈ కాలంలో కొన్ని చిన్న బడ్జెట్ చిత్రాలు కూడా మంచి విజయం సాధించాయి. అలాంటి చిన్న సినిమా కోసం హీరో దగ్గరకు వెళితే.. డెబ్యూ డైరెక్టర్ ను అవమానించకూడదని శోభు అంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. అయితే కొద్ది నిమిషాల్లోనే ఆయన తన ట్వీట్‌ను తొలగించారు.
'రీసెంట్ గా సక్సెస్ అందుకున్న ఓ నటుడు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. కథ చెప్పడానికి వచ్చిన కొత్త దర్శకుడికి కనీస గౌరవం ఇవ్వలేదు. మంచి సినిమా వదులుకున్నాడు. మనకు విజయం వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఈ ప్రవర్తన అతడి కెరీర్‌కు మంచిది కాదు. ఈ విషయాన్ని ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు.'అని శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు.
శోభు యార్లగడ్డ ఈ ట్వీట్‌లో ఏ నటుడి పేరును ప్రస్తావించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఓ చర్చ నడుస్తోంది. నటుడు విశ్వక్ సేన్(Vishwak Sen) గురించి శోభు మాట్లాడరని కొందరు ఉహాగానాలు చేస్తున్నారు. దానికి కూడా కారణం ఉంది. ఇటీవల బేబీ సినిమా(Baby Cinema) మంచి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా డైరెక్టర్ సాయి రాజేశ్.. ఓ యంగ్ హీరో దగ్గరకు కథ చెప్పేందుకు వెళ్తే పట్టించుకోలేదని కామెంట్స్ చేశారు.
తర్వాత ఓ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వక్ సేన్(Viswak Sen).. కథ నచ్చుకుంటే చేయనని ఖరాఖండిగా చెప్పేశాడు. అనవసరంగా వాళ్ల టైమ్ ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పుకొచ్చాడు. దీంతో బేబీ సినిమా కథ.. మెుదట విశ్వక్ సేన్ దగ్గరకు వెళ్లిందని, మంచి సినిమాను వదులుకున్నాడని సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఇప్పుడు తాజాగా శోభు యార్లగడ్డ ట్వీట్ చేయడంతో మరోసారి చర్చ మెుదలైంది.
అయితే కొందరు మాత్రం.. ఆ నటుడు ఎవరో వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేశారు. పెద్ద వివాదం అయ్యే అవకాశం ఉండటంతో శోభు యార్లగడ్డ తన ట్వీట్‌ను తొలగించారు. అప్పటికే చాలామంది దానిని స్క్రీన్ షాట్లు తీసి వైరల్ చేశారు. అలాంటి ఆటిట్యూడ్‌ని ప్రదర్శించిన యంగ్ హీరో ఎవరనే ప్రశ్న ఇప్పుడు సినీవర్గాల్లో మెదులుతోంది.