Annapurna Photo Studio: ఆసక్తికరంగా ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ ట్రైలర్.. విడుదల చేసిన విజయ్ దేవరకొండ
Annapurna Photo Studio Trailer: అన్నపూర్ణ ఫొటో స్టూడియో సినిమా ట్రైలర్ వచ్చేసింది. లవ్‍స్టోరీ, కామెడీ, క్రైమ్ అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.
Annapurna Photo Studio Trailer: 30 వెడ్స్ 21 సిరీస్‍తో మంచి క్రేజ్ సాధించుకున్నాడు నటుడు చైతన్య రావ్. ఆ తర్వాత ముఖచిత్రం, తిమ్మరసుతో పాటు మరిన్ని చిత్రాల్లోనూ కనిపించాడు. ఇప్పుడు చైతన్య రావు హీరోగా ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ సినిమా వస్తోంది. 1980ల బ్యాక్‍డ్రాప్‍లో ఈ థ్రిల్లర్ కామెడీ మూవీ రూపొందింది. ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకత్వం వహించాడు. చైతన్య రావ్‍కు జోడీగా ఈ చిత్రంలో హీరోయిన్‍గా నటించింది లావణ్య సాహుకర. కాగా, నేడు (జూలై 2) అన్నపూర్ణ ఫొటో స్టూడియో ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను హీరో విజయ్ దేవరకొండ లాంచ్ చేశాడు. ఈ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.
గత దశాబ్దాల్లో గ్రామాల్లో ఎక్కువగా కనిపించిన టూరింగ్ టాకీస్ అనౌన్స్‌మెంట్‍తో అన్నపూర్ణ ఫొటో స్టూడియో ట్రైలర్ మొదలవుతుంది. సినిమాలోని వివిధ అంశాలను పరిచయం చూస్తే సీన్‍ల మధ్యలో వాయిస్ ఓవర్‌లా ఉంటుంది. ఇక ఈ ట్రైలర్‌లో చైతన్య రావ్ సహా మిగిలిన వారి కామెడీ బాగా పండింది. మొత్తంగా లవ్‍స్టోరీ, కామెడీ, క్రైమ్‍లతో అన్నపూర్ణ ఫొటో స్టూడియోలో ట్విస్టులు చాలా ఉంటాయనేలా ట్రైలర్ ఉంది. 2 నిమిషాల 3 సెకన్ల పాటు ఉన్న ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. చైతన్య రావ్ వయసు గురించిన పంచ్‍తో ట్రైలర్ ముగుస్తుంది. అన్నపూర్ణ ఫొటో స్టూడియో సినిమా జూలై 21న థియేటర్లలో విడుదల కానుంది.
అన్నపూర్ణ ఫొటో స్టూడియో సినిమాకు చెందు ముద్దు డైరెక్టర్ కాగా, బిగ్‍బెన్ సినిమా బ్యానర్‌పై యశ్ రంగినేని నిర్మించారు. మిహిర, ఉత్తర, వైవా రాఘవ్ ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు. 1980 దశకంలో ఓ గ్రామంలో లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. కామెడీ, క్రైమ్ అంశాలు కూడా ఉండనున్నాయి.
అన్నపూర్ణ ఫొటో స్టూడియో చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీతం అందించగా.. డి.వెంకట్ ప్రభు ఎడిటర్‌గా ఉన్నారు. పంకజ్ తొట్టాడ.. సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు.