Animal Telugu Collections: తెలుగులో యానిమ‌ల్ బ్రేక్ ఈవెన్ - మూడు రోజుల్లో వ‌చ్చిన లాభాలు ఎంతంటే?-animal telugu version break even done ranbir kapoor movie collets 35 crore on 3 days in telugu states ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Animal Telugu Collections: తెలుగులో యానిమ‌ల్ బ్రేక్ ఈవెన్ - మూడు రోజుల్లో వ‌చ్చిన లాభాలు ఎంతంటే?

Animal Telugu Collections: తెలుగులో యానిమ‌ల్ బ్రేక్ ఈవెన్ - మూడు రోజుల్లో వ‌చ్చిన లాభాలు ఎంతంటే?

Nelki Naresh Kumar HT Telugu
Dec 04, 2023 01:21 PM IST

Animal Telugu Collections: యానిమ‌ల్ మూవీ తెలుగులో బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే 35 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ సినిమాను తెలుగులో పంపిణీచేసిన దిల్‌రాజుకు మూడు రోజుల్లోనే ఐదు కోట్ల వ‌ర‌కు లాభాలు వ‌చ్చిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

యానిమ‌ల్ మూవీ
యానిమ‌ల్ మూవీ

Animal Telugu Collections: ర‌ణ్‌భీర్ క‌పూర్ యానిమ‌ల్ మూవీ తెలుగు వెర్ష‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము రేపుతోంది. రెండు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌నుసాధించింది. మొత్తంగా ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో 35 కోట్ల‌కుపైగా గ్రాస్‌ను, 19 కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ సినిమాను దాదాపు 14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో తెలుగులో నిర్మాత దిల్‌రాజు రిలీజ్ చేశారు. మూడు రోజుల్లో దిల్‌రాజుకు యానిమ‌ల్ మూవీ ఐదు కోట్ల వ‌ర‌కు లాభాల‌ను మిగిల్చింది.

ఆదివారం ఎలెక్ష‌న్స్ రిజ‌ల్ట్ కార‌ణంగా వ‌సూళ్లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. కానీ సోమ‌వారం యానిమ‌ల్ క‌లెక్ష‌న్స్ మ‌ళ్లీ పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. తెలుగులో ర‌ణ్‌బీర్ క‌పూర్ డ‌బ్బింగ్ మూవీస్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా యానిమ‌ల్ నిలిచింది. బ్ర‌హ్మాస్త్ర రికార్డును బ్రేక్ చేసింది.

వ‌ర‌ల్డ్ వైడ్‌గా మూడు రోజుల్లో 356 కోట్ల గ్రాస్‌, 201 కోట్ల నెట్ క‌లెక్ష‌న్స్‌ను యానిమ‌ల్ రాబ‌ట్టింది. ఓవ‌రాల్‌గా తెలుగు వెర్ష‌న్ 25 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు.

ర‌ణ్‌బీర్‌క‌పూర్‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టించిన యానిమ‌ల్ మూవీకి సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. బాబీడియోల్ విల‌న్‌గా న‌టించిన ఈ సినిమాలో అనిల్‌క‌పూర్ కీల‌క పాత్ర పోషించాడు. క‌బీర్‌సింగ్ అనంత‌రం దాదాపు నాలుగేళ్ల విరామం త‌ర్వాత సందీప్‌రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూవీ ఇది.

Whats_app_banner