Anil Ravipudi | మహేశ్‌ కోసం స్క్రిప్ట్ తయారు చేస్తున్నా: అనిల్ రావిపూడి-anil ravipudi says working on a script for mahesh babu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anil Ravipudi | మహేశ్‌ కోసం స్క్రిప్ట్ తయారు చేస్తున్నా: అనిల్ రావిపూడి

Anil Ravipudi | మహేశ్‌ కోసం స్క్రిప్ట్ తయారు చేస్తున్నా: అనిల్ రావిపూడి

Maragani Govardhan HT Telugu
Apr 29, 2022 03:41 PM IST

సరిలేరు నీకెవ్వరు చిత్రంతో దర్శకుడు అనిల్ రావిపూడి.. మహేశ్ బాబుకు సూపర్ హిట్‌ను అందించారు. ఈ చిత్రం ప్రిన్స్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. తాజాగా మహేశ్‌తో మరోసారి పనిచేయాలనుందని అనిల్ తన మనస్సులో మాటను చెప్పారు.

<p>మహేశ్ బాబు-అనిల్ రావిపూడి&nbsp;</p>
మహేశ్ బాబు-అనిల్ రావిపూడి (twitter)

సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం సరిలేరు నీకెవ్వరూ. సినిమా అత్యుత్తమ కలెక్షన్లు సాధించడంతో పాటు పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని మహేశ్ అభిమానులను అలరించింది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రిన్స్‌ను ఫ్యాన్స్ ఏ విధంగా అయితే చూడాలనుకుంటున్నారో అదే తరహాలో చూపించి సూపర్ సక్సెస్ అందుకున్నారు. దీంతో అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మరోసారి మహేశ్ బాబు నటించాలని కోరుకుంటున్నారు. తాజాగా అనిల్ కూడా ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. మహేశ్ కోసం ఆయన ఓ స్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

మహేశ్ సర్‌తో మరోసారి కలిసి పనిచేయడానకి సిద్ధంగా ఉన్నాను. ఆయన ఓకే అంటే ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేస్తే సినిమా ప్రారంభిస్తాను అని అనిల్ రావిపూడి ఇంటర్వ్యూలో తెలిపారు. మహేశ్‌తో తనకు గొప్ప అనుబంధముందని, ఫలితంగా త్వరలో రాబోయే చిత్రంలో పరస్ఫర అవగాహన ఉందని దర్శకుడు వెల్లడించారు.

ప్రస్తుతం మహేశ్ బాబు.. పరశురామ్ దర్శకత్వంలో చేసిన సర్కారు వారి పాట సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కీర్తి సురేశ్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేనీ, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మహేశ్.. త్రివిక్రమ్ డైరక్షన్‌లో ఓ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

మరోపక్క అనిల్ రావిపూడి.. తాను తెరకెక్కించిన ఎఫ్3 సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా వచ్చే నెల 27న విడుదల కానుంది. వెంకటేశ్, వరుణ్ తేజ్‌తో తీసిన ఈ చిత్రం ఎఫ్2కు సీక్వెల్‌గా రానుంది. తమన్నా, మెహరీన్ కథానాయికలు. ఇది కాకుండా నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నారు అనిల్. బాలయ్యతో చేయబోయే సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఇది విభిన్న జోనర్‌లో ఉండటమే కాకుండా.. సర్‌ప్రైజింగ్ విషయాలో ఎన్నో ఉంటాయని స్పష్టం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం