Action Drama OTT: పది నెలల తర్వాత ఓటీటీలోకి అనసూయ రజాకర్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Action Drama OTT: అనసూయ, వేదిక, బాబీ సింహ ప్రధాన పాత్రల్లో నటించిన రజాకార్ మూవీ థియేటర్లలో రిలీజైన పది నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. త్వరలో ఆహా ఓటీటీలో ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.
Action Drama OTT: హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన తెలుగు మూవీ రజాకార్ థియేటర్లలో రిలీజైన పది నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడానికి ముందు రజాకార్లు సాగించిన అకృత్యాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ఈ సినిమాకు యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. రజాకార్ మూవీలో అనసూయ, బాబీ సింహా, వేదిక, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఆహా ఓటీటీలో...
మార్చి 15న థియేటర్లలో రిలీజైన రజాకార్ మూవీ ఓ వర్గం ఆడియెన్స్‌ను మెప్పించింది. కాంట్రవర్షియల్ కాన్సెప్ట్‌తో రజాకార్ మూవీ తెరకెక్కడంతో ఓటీటీలో ఈమూవీ రిలీజ్ కావడం అనుమానమంటూ వార్తలొచ్చాయి. ఓటీటీ రిలీజ్‌డేట్‌పై మేకర్స్ కూడా ఇన్నాళ్లు ఎలాంటి ప్రకటన చేయకపోవడంఈ పుకార్లకు బలాన్ని చేకూర్చింది. ఎట్టకేలకు రజాకార్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది.
ఈ హిస్టారికల్ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఆహా ఓటీటీ సొంతం చేసుకున్నది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ స్వయంగా ప్రకటించింది. త్వరలోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రజాకార్‌ను తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. డిసెంబర్ 20 లేదా 26న రజాకార్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ సాయుధ పోరాటం...
నిజాం పాలనలో రజాకార్లు ఓ వర్గం వారిని టార్గెట్ చేస్తూ ఎలాంటి దురాగతాలు, హింసలకు పాల్పడ్డారనే అంశాలతోమ యథార్థ ఘటనల నుంచి స్ఫూర్తి పొందుతూ దర్శకుడు రజాకార్ కథను రాసుకున్నాడు. తెలంగాణ సాయిధ పోరాటానికి ప్రతీకగా నిలిచిన భైరాన్‌పల్లి, పరకాల జెండా ఉద్యమంతో లాంటి సంఘటనలతో పాటు చాకలి ఐలమ్మ, శాంతవ్వ, రాజిరెడ్డి లాంటి పోరాట యోధుల జీవితాల్ని ఈ మూవీలో చూపించారు మేకర్స్.
రజాకార్ మూవీ కథ…
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇండియాలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసేందుకు నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ అంగీకరించడు. రజాకార్ల సాయంతో ఇండిపెండెంట్‌గానే హైదరాబాద్‌ను పాలించాలని నిర్ణయించుకుంటాడు. ఖాసీం రజ్వీ నాయకత్వంలో రజాకర్లు హిందువులును ముస్లింలుగా మార్చేందుకు కుట్రలు పన్నుతారు.
నిజాం ప్రధాని లాయక్ అలీ కూడా ఖాసీం రజ్వీని సపోర్ట్ చేస్తాడు. ఉర్దూ తప్ప మిగిలిన భాషలు మాట్లాడకూడదని కట్టడి విధిస్తారు. తమకు ఎదురుతిరిగిన ప్రజలను రజాకర్లు దారుణంగా అంతమొందిస్తారు.
సిస్తుల పేరుతో ప్రజలకు దోచుకోవడం మొదలుపెడతారు. రజాకర్లకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ, రాజిరెడ్డి, శాంతవ్వ తో పాటు చాలా మంది నాయకులు ఎలాంటి పోరాటం సాగించారు? రజాకర్ల కుట్రలను సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఎలా తిప్పికొట్టాడు.
నెహ్రూ అంగీకరింకపోయినా వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో ఏ విధంగా విలీనం చేశాడు? నిజాం నవాబ్ విలీనానికి అంగీకరించాడా? మతకల్లోలాలు సృష్టించాలని అనుకున్న ఖాసీం రజ్వీ కుట్రలను పటేల్ ఎలా అడ్డుకున్నాడు? అన్నదే రజాకర్ మూవీ కథ. ఇటీవలే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో రజాకార్ మూవీని స్క్రీనింగ్ చేశారు.