Begumbazar Murders: హైదరాబాద్‌లో ఘోరం.. బేగంబజార్‌లో భార్యా కుమారుడి హత్య.. ఆపై భర్త ఆత్మహత్య
Begumbazar Murders: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో యూపీకి చెందిన సిరాజ్ అనే వ్యక్తి భార్యాకుమారుడిని దారుణంగా హత్య చేసిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడి మరో కుమారుడు తప్పించుకుని పారిపోయాడు.
Begumbazar Murders: హైదరాబాద్ బేగంబజార్‌లోని తోప్‌ఖానాలో నివాసం ఉంటున్న సిరాజ్ అనే వ్యక్తి భార్యాకుమారుడిని దారుణంగా హత్య చేశాడు. రెండు రోజుల క్రితమే యూపీ నుంచి కుటుంబాన్ని హైదరాబాద్ తీసుకొచ్చాడు. గత ఆరేళ్లుగా నగరంలోని పాతబస్తీ గాజుల తయారీలో సిరాజ్ పనిచేస్తున్నాడు. సొంతూళ్లో ఉంటున్న భార్యా కుమారులను ఇటీవల నగరానికి తీసుకువచ్చి తోప్‌ఖానాలో కాపురం పెట్టాడు.
హైదరాబాద్‌లో కాపురం పెట్టినప్పటి నుంచి భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున భార్యను గొంతు కోసి చంపేసిన సిరాజ్ చిన్న కుమారుడు హైదర్‌ను గొంతు నులిమి చంపుతుండగా లేచిన పెద్ద కుమారుడు భయంతో కేకలు వేస్తూ ఇంటి నుంచి బయటకు పరుగులు తీశాడు.
భార్య గొంతు కోసిన తర్వాత కుమారుడు హైదర్ గొంతు నులిమి హత్య చేశాడు. తల్లి రక్తపు మడుగులో ఉండటం, తమ్ముడిని గొంతు నులుముతుండటంతో భయపడిన సిరాజ్ పెద్ద కుమారుడు గట్టిగా కేకలు వేస్తూ ఇంటి బయటకు పారిపోయాడు. అతని అరుపులతో అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భార్యా కుమారుడిని చంపిన తర్వాత సిరాజ్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలం చేరుకునే సరికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. క్లూస్ టీమ్ ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించింది. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు.