OTT Mythological: ఓటీటీలోకి డైరెక్ట్‌గా వచ్చేసిన తెలుగు మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్- శ్రీ విష్ణు అవతారాలతో చంపే కిల్లర్!
Harikatha OTT Streaming: ఓటీటీలోకి ఇవాళ డైరెక్ట్‌గా వచ్చేసింది తెలుగు మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ హరికథ. బిగ్ బాస్ దివి, హీరో శ్రీరామ్, రాజేంద్ర ప్రసాద్ నటించిన హరికథ పురాణాల్లోని కథలను బేస్ చేసుకుని క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కించారు. హరికథ ఓటీటీ రిలీజ్ వివరాల్లోకి వెళితే!
Mythological Thriller Harikatha OTT Release: క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లకు మంచి క్రేజ్ ఉంటుంది. థియేటర్లలో కంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ మూవీస్‌ను ఓటీటీలో చూసేందుకు ఎక్కువ ఇష్టపడుతుంటారు ఆడియెన్స్. ఇక అలాంటి వారికోసమే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్‌లను తీసుకొస్తున్నాయి.
క్రైమ్ థ్రిల్లర్స్‌కు అదనంగా
అయితే, ఇటీవల కాలంలో ఒక్క జోనర్‌లోనే కాకుండా వివిధ జోనర్స్‌ను టచ్ చేస్తూ తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్స్‌కు మైథలాజికల్, లేదా ఫాంటసీ, కామెడీ, రొమాంటిక్ అండ్ బోల్డ్ వంటి ఎలిమెంట్స్‌ను యాడ్ చేసి చిత్రీకరిస్తున్నారు. అలా మైథలాజికల్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన తెలుగు వెబ్ సిరీస్ హరికథ.
శ్రీ విష్ణువు పది అవతారాలతో
భారతీయ పురాణాల్లోని పాపులర్ కథలను ఆధారంగా చేసుకుని ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో హరికథ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. శ్రీ విష్ణువు పది అవతారాలను చూపిస్తూ అన్యాయం, అక్రమాలు, నేరాలు చేసిన వారిని ఎలా చంపారు?, వారిని ఎవరు చంపారు?, ఎందుకు చంపారు? అని ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ వంటి ఇతర అంశాలతో హరికథను రూపొందించారు.
హరికథ ముఖ్య పాత్రలు
హరికథ వెబ్ సిరీస్‌లో బిగ్ బాస్ దివి వాద్యా, హీరో శ్రీరామ్, నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించారు. వారితోపాటు బ్యూటిఫుల్ పూజిత పొన్నాడ, మౌనిక రెడ్డి, బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, రుచిర సాధినేని, శ్రియా కొట్టం, ఉషా శ్రీ తదితరులు కూడా ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
బోల్డ్ వెబ్ సిరీస్ డైరెక్టర్
తెలుగు వెబ్ సిరీస్ హరికథను ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ హరికథ వెబ్ సిరీస్‌కు మ్యాగీ దర్శకత్వం వహించారు. ఆయన ఇదివరకు తెలుగు బోల్డ్ అండ్ రొమాంటిక్ వెబ్ సిరీస్ 3 రోజెస్‌ను తెరకెక్కించారు. ఇక హరికథ వెబ్ సిరీస్ హాట్‌స్టార్ స్పెషల్స్‌గా రూపొందింది.
ఆరు భాషల్లో స్ట్రీమింగ్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో హరికథ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ (డిసెంబర్ 13) ఓటీటీ రిలీజ్ అయిన హరికథ వెబ్ సిరీస్ తెలుగుతోపాటు హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ, కన్నడ వంటి ఆరు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా తెలుగు భాషలో డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో కూడా హరికథ డిజిటల్ ప్రీమియర్ అవడం విశేషం. దీంతో మంచి సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కలుగుతుంది.
ఆరు ఎపిసోడ్స్- డిఫరెంట్ రన్ టైమ్
హరికథ వెబ్ సిరీస్‌లో ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ సుమారుగా, 43, 35, 25 నిమిషాల రన్ టైమ్‌తో ఉన్నాయి. ఈ సిరీస్‌లో నాటకాలు వేసే పాత్రలో రాజేంద్ర ప్రసాద్, పోలీస్ ఆఫీసర్‌గా శ్రీరామ్, నాటు వైద్యం చేసే గిరిజిన అమ్మాయిగా బిగ్ బాస్ దివి నటించినట్లు హరికథ ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.