Anasuya |కోర్టు బోనులో అనసూయ...సింబా పోస్టర్ రిలీజ్
అనసూయ పుట్టినరోజు సందర్భంగా సింబా సినిమాలోని ఆమె ఫస్ట్‌లుక్ ను చిత్రయూనిట్ విడుదలచేసింది. ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను రాజేందర్ రెడ్డితో కలిసి ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మిస్తున్నారు.
ఓ వైపు యాంకర్‌గా బిజీగా కొనసాగుతూనే వెండితెరపై డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ ప్రతిభను చాటుకుంటోంది అనసూయ. ఇటీవలే ఖిలాడి సినిమాలో భిన్న షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం అనసూయ నటిస్తున్న పలు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
ఆదివారం అనసూయ పుట్టినరోజు సందర్భంగా సింబా సినిమాలోని ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కోర్టు బోనులో నిల్చొని న్యాయం కోసం ఎదురుచూస్తూ అనసూయ కనిపిస్తోంది. ఆమె తలపై గాయం ఉండటం ఆసక్తిని పంచుతోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అనసూయ పాత్ర ప్రధానంగానే ఈ చిత్ర కథ సాగుతుందని సమాచారం.
ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సంపత్ నంది...రాజేందర్ రెడ్డితో కలిసి నిర్మిస్తున్నారు. మురళీమనోహర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అటవీ సంరక్షణ ఆవశ్యకతను చాటిచెబుతూ సందేశాత్మకంగా కథాంశంతో సింబా రూపొందుతోంది.
ఇందులో జగపతిబాబు కీలక పాత్రను పోషిస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ వశిష్ట సింహా పోలీస్ అధికారి పాత్రను పోషిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్