Amigos profits: రిలీజ్‌కు ముందే లాభాలు.. కల్యాణ్ రామ్ అమిగోస్ సంచలనం-amigos gets profits even before its theatrical release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Amigos Gets Profits Even Before Its Theatrical Release

Amigos profits: రిలీజ్‌కు ముందే లాభాలు.. కల్యాణ్ రామ్ అమిగోస్ సంచలనం

Hari Prasad S HT Telugu
Jan 24, 2023 03:11 PM IST

Amigos profits: రిలీజ్‌కు ముందే లాభాలు ఆర్జించింది కల్యాణ్ రామ్ మూవీ అమిగోస్. భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కేవలం నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారానే లాభాల్లోకి వెళ్లడం విశేషం

అమిగోస్ మూవీలో కల్యాణ్ రామ్
అమిగోస్ మూవీలో కల్యాణ్ రామ్

Amigos profits: బింబిసార మూవీతో నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ సినిమా ఊహించని విధంగా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడంతోపాటు తర్వాత ఓటీటీ, టీవీల్లోనూ రికార్డు స్థాయి వ్యూస్, టీఆర్పీలను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా తర్వాత వస్తున్న కల్యాణ్ రామ్ మూవీ అమిగోస్ పై రిలీజ్ కు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అందుకు తగినట్లే ఈ మధ్యే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కు ముందే లాభాల్లోకి వెళ్లడం విశేషం. కొత్త డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న అమిగోస్ మూవీ నాన్ థియేట్రికల్ హక్కులను అమ్మడం ద్వారానే తన బడ్జెట్ కంటే ఎక్కువ మొత్తం పొందినట్లు సమాచారం.

బింబిసార సూపర్ హిట్ కావడంతో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. అంతేకాదు ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతున్న సినిమాల్లో బలమైన ట్రేడ్ బజ్ ఉన్న సినిమాగా కూడా అమిగోస్ నిలిచింది. ఫిబ్రవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అషికా రంగనాథ్ ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నటిస్తోంది.

జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు. రవిశంకర్, నవీన్ యెర్నేని కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కింద ఈ సినిమాను నిర్మించారు. రిలీజ్ కు ముందే లాభాల్లోకి దూసుకెళ్లిన అమిగోస్.. థియేటర్లలో రిలీజైన తర్వాత మరెన్ని లాభాలీను తీసుకొస్తుందో అన్న ఆసక్తి ఇప్పుడు నందమూరి అభిమానుల్లో నెలకొంది. బింబిసారతో తన కెరీర్లోనే అతిపెద్ద విజయం అందుకున్న కల్యాణ్ రామ్.. ఈ అమిగోస్ తో ఏం చేస్తాడో చూడాలి.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్