OTT: ఒకే ఓటీటీలోకి అమరన్, లక్కీ భాస్కర్ - స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
OTT: అమరన్, లక్కీ భాస్కర్ సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఫిక్సయ్యాయి. ఈ సినిమాల డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో ఈ సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
OTT: శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన అమరన్, లక్కీ భాస్కర్ సినిమాలు పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. దేశభక్తి ప్రధాన కథాంశంతో అమరన్ మూవీ తెరకెక్కగా...బ్యాంక్ స్కామ్ బ్యాక్‌డ్రాప్‌లో లక్కీ భాస్కర్ మూవీ రూపొందింది. ఈ రెండు సినిమాల డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నది.
థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత అమరన్, లక్కీ భాస్కర్ ఓటీటీలోకి రానున్నట్లు చెబుతోన్నారు. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళంతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో అమరన్, లక్కీ భాస్కర్ సినిమాలు రిలీజ్ కానున్నట్లు సమాచారం.
ముకుంద్ జీవితం ఆధారంగా...
ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన అమరన్ మూవీలో శివకార్తికేయన్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించారు. రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వం వహించిన ఈ మూవీని అగ్ర నటుడు కమల్‌హాసన్ ప్రొడ్యూస్ చేశాడు. ఆరంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ దీపావళికి రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. తొలిరోజు వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ 21 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.
గత సినిమాలకు భిన్నంగా...
గతంలో వచ్చిన ఆర్మీ బ్యాక్‌డ్రాప్ మూవీస్‌కు భిన్నంగా ఎమోషన్స్, యాక్షన్ అంశాల కలబోతగా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియాసామి అమరన్ మూవీని రూపొందించాడు. వృత్తి బాధ్యతల కారణంగా కుటుంబాలకు దూరమై సైనికులు ఎదుర్కొనే సంఘర్షణ హృద్యంగా ఈ మూవీలో చూపించాడు. కశ్మీర్‌లో డ్యూటీ చేసే సైనికులకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతుంటాయన్నది సహజంగా ఈ మూవీలో చూపించిన తీరుకు ప్రశంసలు దక్కుతోన్నాయి.
మేజర్ ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్, ఇందు రెబెకా జాన్ పాత్రలో సాయిపల్లవి నటన అద్భుతమంటూ ఆడియెన్స్ చెబుతోన్నారు. అమరన్ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ తొలిరోజు భారీగా కలెక్షన్స్ రాబట్టింది.
బ్యాంక్ స్కామ్ బ్యాక్‌డ్రాప్‌లో...
బ్యాంక్ స్కామ్ నేపథ్యంలో పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన లక్కీ భాస్కర్ మూవీలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. కుటుంబ బాధ్యతల్ని నెరవేర్చడానికి ఓ సాధారణ బ్యాంక్ క్లర్క్ చేసిన ఓ పెద్ద స్కామ్ చుట్టూ దర్శకుడు వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ కథను రాసుకున్నాడు. పెయిడ్ ప్రీమియర్స్ నుంచి డీసెంట్ టాక్‌ను సొంతం చేసుకున్నది లక్కీ భాస్కర్.
దుల్కర్ నటన
బ్యాంక్ ఉద్యోగి పాత్రలో దుల్కర్ నటనతో పాటు వెంకీ అట్లూరి కథ, కథనాలు బాగున్నాయంటూ తెలుగు ఆడియెన్స్ కామెంట్స్ చేస్తోన్నారు. లక్కీ భాస్కర్ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. డైరెక్ట్‌గా తెలుగులో రూపొందిన ఈ మూవీ మలయాళం, తమిళ ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది. అమరన్‌తో పాటు లక్కీ భాస్కర్ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించడం గమనార్హం.