Amala Paul: బీర్ బాటిల్‍తో దొరికిపోయిన హీరోయిన్ అమలాపాల్.. మన బ్రాండే అంటూ కామెంట్స్
Amala Paul With Beer Bottle: మలయాళ ముద్దుగుమ్మ అమలా పాల్ ప్రస్తుతం సినిమాలతో పాటు సోషల్ మీడియాలో బికినీ, అతి చిన్న పొట్టి బట్టల్లో దర్శనం ఇస్తూ అట్రాక్ట్ చేస్తోంది. అయితే తాజాగా బీర్ బాటిల్‍తో దొరికిపోయిన అమలా పాల్‍పై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
తెలుగు చిత్ర సీమలోకి ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అలా అడుగు పెట్టిన మలయాళ బ్యూటీనే అమలా పాల్. బెజవాడ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమలా పాల్ లవ్ ఫెయిల్యూర్ మూవీతో తెలుగు యువత మనసు దోచుకుంది. ఆ తర్వాత నాయక్, రఘువరన్ బీటెక్, ఇద్దరమ్మాయిలతో వంటి సినిమాలతో అలరించింది. కానీ, హీరోయిన్‍గా తెలుగులో అంతగా స్టార్ ఇమేజ్ తెచ్చుకోలేకపోయింది. అనంతరం తమిళ చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయింది అమలా పాల్.
నగ్నంగా కనిపించి
సినిమాలు చేస్తున్న సమయంలోనే డైరెక్టర్ ఏఎల్ విజయ్‍తో కొంతకాలం సీక్రెట్‍గా ప్రేమాయణం సాగించింది అమలా పాల్. తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న అమలా పాల్-విజయ్ నాలుగేళ్లకు విడిపోయారు. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రస్తుతం కాన్సెప్ట్ ఒరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది. ఆమె సినిమాలో ఏకంగా నగ్నంగా దర్శనం ఇచ్చి హాట్ టాపిక్ అయింది. అలాగే కుడిఎడమైతే వంటి వెబ్ సిరీసులతో ఓటీటీలోనూ ఆకట్టుకుంది అమలా పాల్. ఆమె నటించిన కడావర్ వెబ్ సిరీస్ సైతం మంచి ఆదరణే సంపాదించుకుంది.
వచ్చే సినిమాలు
ఇటీవల టీచర్ అనే మరో ఓటీటీ మూవీతో ప్రేక్షకులను పలకరించింది అమలా పాల్. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైన టీచర్ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. ప్రస్తుతం సర్వైవల్ డ్రామాగా ఆడు జీవితం (Aadujeevitham) అనే సినిమా చేస్తోంది అమలా పాల్. బ్లెస్సీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. అలాగే ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మలయాళంతోపాటు పలు భాషల్లో విడుదల కానుంది. ఇదే కాకుండా డివిజ, యునైటెడ్ బ్యానర్ నిర్మిస్తున్న మరో సినిమా చేస్తోంది అమలా పాల్.
బీర్ బాటిల్‍తో
ఇదిలా ఉంటే సినిమాల్లో పద్ధతిగా కనిపించే అమలా పాల్ సోషల్ మీడియాలో మాత్రం తెగ హాట్ లుక్స్ తో అట్రాక్ట్ చేస్తుంటుంది. పొట్టి బట్టలు, బికినీలలో బీచ్‍లో అందాలను ఆరబోస్తుంటుంది. అయితే తాజాగా బికినీ వేసుకుని బీచ్‍లో బీర్ బాటిల్‍తో దొరికిపోయింది అమలా పాల్. ఫ్రెండ్స్ తో వెకేషన్ లో ఉన్న అమలా పాల్ షేర్ చేసిన ఫొటోల్లో బీర్ బాటిల్ పక్కన పెట్టుకుని పుస్తకం చదువుతూ ఆమె కనిపించింది. చూస్తుంటే ఆ బీర్ బాటిల్‍ను అమలా ఖాలీ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు మన బ్రాండే ఉన్నట్లుంది, నా ఫేవరేట్ డ్రింక్ వాటర్ మిలన్, లుకింగ్ గార్జియస్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.