తెలుగు న్యూస్ / ఫోటో /
Allu Arjun Arrest: కూల్‌గా కాఫీ తాగుతూ.. భార్యకు ముద్దు పెట్టి.. దర్జాగా నవ్వుతూ అరెస్ట్ అయిన అల్లు అర్జున్ (ఫొటోలు)
- Allu Arjun Arrest Photos Viral: అల్లు అర్జున్ అరెస్ట్ సినీ ఇండస్ట్రీతోపాటు పొలిటికల్‌గా చాలా హాట్ టాపిక్ అయింది. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చిన సమయంలో కూల్‌గా కాఫీ తాగుతూ, భార్య స్నేహ రెడ్డితో జోకులు వేస్తూ బన్నీ కనిపించిన తీరు రియల్ పుష్పను తలపించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

(1 / 8)
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన ఇండియా వైడ్‌గా హాట్ టాపిక్ అవుతోంది. పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ షో (డిసెంబర్ 4) రోజున సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
(2 / 8)
అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చిన సమయంలో అల్లు అర్జున్ చాలా కూల్‌గా కాఫీ తాగుతూ కనిపించాడు. ఎలాంటి బెరుకు లేకుండా ధైర్యంగా కనిపించాడు. అంతేకాకుండా పుష్ప 2 ప్రమోషన్స్‌లో వేసుకున్న టీ షర్ట్‌తో అట్రాక్ట్ చేశాడు.
(3 / 8)
భర్త అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చినప్పుడు భార్య స్నేహా రెడ్డి టెన్షన్‌గా కనిపించారు. ఆమె మొహంలో కాస్తా భయం, బెరుకు కనిపించాయి.
(4 / 8)
భార్య టెన్షన్ పడటం చూసి అల్లు అర్జున్ నవ్వించే ప్రయత్నం చేశాడు. కాఫీ తాగుతూ, ఏవో జోకులు వేసినట్లుగా వైరల్ అయిన వీడియోలో కనిపించింది. దానికి అల్లు అరవింద్ నవ్వినా.. స్నేహా రెడ్డి మాత్రం కష్టంగా చిరునవ్వు ఇచ్చారు.
(5 / 8)
అల్లు అర్జున్ అరెస్ట్ అయి వెళ్లే సమయంలో భార్యకు ముద్దు పెట్టి, తండ్రికి ధైర్యం చెప్పాడు. స్నేహా రెడ్డికి ముద్దిచ్చి తన ప్రేమను చాటుకున్నాడు. అంతేకాకుండా నవ్వుతూ, పోలీసులకు కోపరేట్ చేస్తూ దర్జాగా అరెస్ట్ అయిన అల్లు అర్జున్‌ను రియల్ లైఫ్‌లో కూడా పుష్పనే అని అభిమానులు పొగుడుతున్నారు.
(7 / 8)
అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం బన్నీకి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఇతర గ్యాలరీలు