Credit cards: ఈ క్రెడిట్ కార్డ్స్ తో లగ్జరీ హోటల్స్ లో ఫ్రీగా స్టే చేయొచ్చు..
Credit cards: క్రెడిట్ కార్డులు అత్యవసర, అసాధారణ నగదు అవసరాలను తీరుస్తాయి. ప్రస్తుతం అందరికీ క్రెడిట్ కార్డు ఒక నిత్యావసరమైంది. క్రెడిట్ కార్డులతో చాలా ప్రయోజనాలున్నాయి. కొన్ని ప్రత్యేక కార్డులతో లగ్జరీ హోటెల్స్ లో ఉచితంగా స్టే చేసే అవకాశం లభిస్తుంది.
Credit cards: క్రెడిట్ కార్డులు ఇకపై కేవలం లగ్జరీ మాత్రమే కాదు. ఇప్పుడు క్రెడిట్ కార్డులు మన రోజువారీ ఆర్థిక అవసరాలను తీర్చే సాధనంగా మారాయి. క్రెడిట్ కార్డులు ఇప్పుడు విస్తృతమైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. క్రెడిట్ కార్డుల ద్వారా ఇష్టమైన బ్రాండ్లపై ప్రత్యేకమైన డిస్కౌంట్లను పొందవచ్చు. మీ క్రెడిట్ కార్డును ఉపయోగించిన ప్రతిసారీ క్యాష్ బ్యాక్ లను పొందవచ్చు.
తరచుగా ప్రయాణించేవారైతే..
క్రెడిట్ కార్డుల్లో చాలా కేటగిరీలు ఉంటాయి. క్రెడిట్ కార్డుకు అప్లై చేసే ముందే, మీకు సూట్ అయిన, మీ అవసరాలకు అనుగుణమైన క్రెడిట్ కార్డును ఎంచుకోవాలి. మీరు తరచుగా ప్రయాణించేవారైతే, ట్రావెల్ క్రెడిట్ కార్డు మీకు ఉత్తమ ఎంపిక అవుతుంది. ఎందుకంటే, ట్రావెల్ క్రెడిట్ కార్డులతో కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఫ్లైట్ డిస్కౌంట్ కూపన్లు, లగ్జరీ హోటళ్లలో కాంప్లిమెంటరీ బసలను పొందవచ్చు. లగ్జరీ హోటళ్లలో కాంప్లిమెంటరీ బస ను అందించే అత్యంత ప్రాచుర్యం పొందిన 4 క్రెడిట్ కార్డుల గురించి తెలుసుకుందాం. అయితే, వీటి వార్షిక రుసుము, ఇతర ఫీజులు కూడా భారీగానే ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
1. అమెరికన్ ఎక్స్ ప్రెస్ ప్లాటినం క్రెడిట్ కార్డ్
ముఖ్య ప్రయోజనాలు:
- ఈ కార్డుతో ఉచిత రూమ్ అప్ గ్రేడ్, కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్, ఎర్లీ చెక్-ఇన్, ఉచిత లేట్ చెక్-అవుట్ వంటి ప్రీమియం ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
- ఫోర్ సీజన్స్, రిట్జ్ కార్ టన్ వంటి లగ్జరీ హోటళ్లతో బుకింగ్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్లు, డీల్స్ ఉన్నాయి.
- ప్రయారిటీ పాస్, అమెరికన్ ఎక్స్ ప్రెస్ లాంజ్ లు, ప్రపంచవ్యాప్తంగా 1,200 ఎయిర్ పోర్ట్ లాంజ్ లకు కాంప్లిమెంటరీ యాక్సెస్.
- ఫ్రీ రూమ్ అప్‌గ్రేడ్, ఇద్దరికి ఉచితంగా అల్పాహారం, ఆలస్యంగా చెక్‌అవుట్ చేసే అవకాశం. ఫోర్ సీజన్స్, మాండరిన్ ఓరియంటల్, ది రిట్జ్ కార్ల్‌టన్ తదితర హోటల్‌లకు ఎలైట్ యాక్సెస్‌తో సహా రూ. 37,000 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు.
- అన్ని తాజ్, సెలెక్యూషన్స్, వివాంటా హోటళ్లలో బస చేయడానికి 25% వరకు ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ను పొందవచ్చు.
- ఖర్చు చేసిన ప్రతి రూ. 40 కి 1 మెంబర్‌షిప్ రివార్డ్ పాయింట్, అంతర్జాతీయ లావాదేవీలపై 3X పాయింట్‌లు, రివార్డ్ మల్టిప్లైయర్ ద్వారా చేసే కొనుగోళ్లపై 5X పాయింట్‌లను పొందండి.
- VIP-మాత్రమే ఈవెంట్‌లకు ప్రత్యేకమైన ఆహ్వానాలను పొందండి. ఫ్యాషన్ వీక్, గ్రామీ అవార్డులు, వింబుల్డన్ వంటి ప్రీమియం ఈవెంట్‌లకు ప్రి-సేల్ యాక్సెస్.
- కాంప్లిమెంటరీ EazyDiner ప్రైమ్ మెంబర్‌షిప్, భారతదేశం అంతటా 1,800 ప్రీమియం రెస్టారెంట్‌లలో గరిష్టంగా 50% వరకు తగ్గింపును అందిస్తోంది.
2. హెచ్డీఎఫ్సీ ఇన్ఫినియా మెటల్ క్రెడిట్ కార్డు
ప్రయోజనాలు
- ఎంపిక చేసుకున్న ITC హోటళ్లలో 3 నైట్స్ బుక్ చేసినప్పుడు 1 నైట్ బసను ఉచితంగా పొందండి.
- ఏదైనా ఐటిసి హోటల్ లో 1+1 కాంప్లిమెంటరీ వీకెండ్ బఫెట్ లో పాల్గొనే అవకాశం.
- ప్రైమరీ, అదనపు కార్డ్ హోల్డర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్ పోర్ట్ లాంజ్ లకు కాంప్లిమెంటరీ యాక్సెస్.
- ఖర్చు చేసిన ప్రతి రూ. 150కి 5 రివార్డ్ పాయింట్లు, స్మార్ట్ బై ద్వారా ప్రయాణం మరియు షాపింగ్ పై 10X రివార్డ్ పాయింట్లు.
3. యాక్సిస్ బ్యాంక్ రిజర్వ్ క్రెడిట్ కార్డ్
ప్రయోజనాలు:
- రెండు రోజుల బసపై కాంప్లిమెంటరీ మూడవ రాత్రి బసను ఉచితంగా పొందవచ్చు. భోజనంపై 50% తగ్గింపు. ఆహారం, పానీయాల ఖర్చులపై 25% గ్రీన్ పాయింట్లు లభిస్తాయి.
- ఫుడ్ అండ్ బేవరేజెస్ పై 20% డిస్కౌంట్ పొందండి. భారతదేశంలోని ఎంపిక చేసిన మారియట్ హోటళ్లలో బసపై 20% డిస్కౌంట్. ఆసియా పసిఫిక్ అంతటా వారాంతపు రేట్లు.
- ఈజీడైనర్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ద్వారా ఎంపిక చేసిన రెస్టారెంట్లలో 25% వరకు తగ్గింపు పొందండి.
- బుక్ మై షో ద్వారా బై 1 గెట్ 1 ఆఫర్ తో ఉచిత మూవీ టికెట్లు (రూ. 500 వరకు) మరియు లైవ్ ఈవెంట్ టిక్కెట్లు (రూ. 1,000 వరకు) పొందండి.
- 200 లేదా అంతకంటే ఎక్కువ దేశీయ ఖర్చులకు 15 ఎడ్జ్ రివార్డు పాయింట్లు, రూ. 200 లేదా అంతకంటే ఎక్కువ విదేశీ ఖర్చుకు 30 పాయింట్లు.
4. మారియట్ బోన్వోయ్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్
ప్రయోజనాలు
- ప్రతి సంవత్సరం ఒక ఉచిత రాత్రి బస. (15,000 మారియట్ బోన్వాయ్ పాయింట్‌ల వరకు) పొందండి. అదనంగా, సంవత్సరంలో రూ. 6 లక్షలు లేదా రూ. 9 లక్షలు, లేదా రూ. 15 లక్షలు స్పెండ్ చేయడం ద్వారా అదనపు ఉచిత బసలను పొందవచ్చు.
- కాంప్లిమెంటరీ మారియట్ బోన్వాయ్ సిల్వర్ ఎలైట్ స్టేటస్ ను పొందండి.
- Marriott Bonvoy ప్రోగ్రామ్‌లో మీ రూమ్ ను, మీ సభ్యత్వాన్ని అప్‌గ్రేడ్ చేయడానికి ఉపయోగించే 10 ఎలైట్ నైట్ క్రెడిట్‌లను పొందండి.
- ప్రపంచవ్యాప్తంగా Marriott హోటల్‌లలో ఖర్చు చేసే ప్రతి రూ. 150కి 8 Marriott Bonvoy పాయింట్‌లను పొందండి.
- ప్రయాణం, భోజనం, వినోదాలకు ఖర్చు చేసే ప్రతి రూ. 150కి 4 Marriott Bonvoy పాయింట్‌లను పొందండి.
- లావాదేవీలపై వెచ్చించే ప్రతి రూ. 150కి 2 Marriott Bonvoy పాయింట్‌లను ఆస్వాదించండి.
- అంతర్జాతీయ విమానాశ్రయాలలో సంవత్సరానికి 12 ఉచిత లాంజ్ యాక్సెస్‌లను పొందండి.
- భారతీయ విమానాశ్రయాలలో 12 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ లను పొందండి.
జాగ్రత్తగా వాడండి..
క్రెడిట్ కార్డు (credit cards) లను తెలివిగా, జాగ్రత్తగా ఉపయోగించాలి. రివార్డుల కోసం, లేదా క్యాష్ బ్యాక్ ల కోసం అనవసర ఖర్చులు చేయకూడదు. ఖర్చు చేసే ముందు రీపేమెంట్ సాధ్యమా? కాదా? అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. క్రెడిట్ కార్డును సెలెక్ట్ చేసుకునే ముందే మీ బడ్జెట్ ను, మీ అవసరాలను పరిగణణలోకి తీసుకోండి.
(గమనిక: క్రెడిట్ కార్డ్ ఉపయోగించడంలో కొన్ని రిస్క్ లు ఉన్నాయి)
Credit Card | Annual Fee |
American Express Platinum credit card | Rs. 60,000 + GST |
HDFC Infinia Metal credit card | Rs. 12,500 + GST |
Axis Bank Reserve credit card | Rs. 50,000 + GST |
Marriott Bonvoy HDFC credit card | Rs. 3,000 + GST |