Horror Movie: తమిళ్ హారర్ మూవీని తెలుగులో ఫ్రీగా చూసేయండి - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Horror Movie: తమిళ హారర్ మూవీ స్ట్రైకర్ తెలుగులో రిలీజైంది. యూట్యూబ్‌లో ఫ్రీగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. స్ట్రైకర్ మూవీలో జస్జిన్ విజయ్, విద్యా ప్రదీప్ హీరోహీరోయిన్లుగా నటించారు. కస్తూరి, అభినయశ్రీ కీలక పాత్రల్లో కనిపించారు.
Horror Movie: తమిళ్ హారర్ మూవీ స్ట్రైకర్ తెలుగు వెర్షన్ థియేటర్, ఓటీటీ కాకుండా నేరుగా యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ సినిమాను ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండా ఫ్రీగా యూట్యూబ్‌లో చూడొచ్చు. స్ట్రైకర్ మూవీలో జస్టిన్ విజయ్, విద్యా ప్రదీప్ హీరోహీరోయిన్లుగా నటించారు. కస్తూరి, అభినయశ్రీ కీలక పాత్రలో నటించారు.
ఓజా బోర్డ్ గేమ్
గత ఏడాది సెప్టెంబర్‌లో తమిళంలో థియేటర్లలో స్ట్రైకర్ మూవీ రిలీజైంది. ఓజా బోర్డ్ గేమ్ బ్యాక్‌డ్రాప్‌లో ట్విస్ట్‌లు, టర్న్‌లతో దర్శకుడు ఎస్ ఏ ప్రభు ఈ మూవీని తెరకెక్కించాడు. కాన్సెప్ట్ బాగున్నా హారర్ డోసు తగ్గడంతో ఈ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
స్ట్రైకర్ కథ ఇదే....
పారా సైకాలాజిస్ట్ జోషి (జస్టిన్ విజయ్), యూట్యూబర్ ప్రియ(విద్యా ప్రదీప్) ఊరికి దూరంగా ఉన్న పాతకాలం నాటి విల్లాలో బందీలుగా మారిపోతారు. ఓజా బోర్డ్ గేమ్ ద్వారా ఆ భవంతి నుంచి విముక్తి లభిస్తుందనే సీక్రెట్ వారికి తెలుస్తుంది. ఆ గేమ్ ఆడినప్పటి నుంచి కొన్ని ఆత్మలు వారిని వెంటాడటం మొదలుపెడతాయి. ఆ ఆత్మలు ఎవరు? ఓజా బోర్డ్ గేమ్ కారణంగా జోషి, ప్రియ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఆ విల్లా ఓనర్ రాజేంద్రన్ మరణానికి జోషికి ఎలాంటి సంబంధం ఉంది అన్నదే ఈ మూవీ కథ.
రన్‌టైమ్ 109 నిమిషాలు
స్ట్రైకర్ మూవీ రన్‌టైమ్ 109 నిమిషాలు మాత్రమే కావడం గమనార్హం. స్క్రీన్‌ప్లేతో ఆసక్తి లోపించడం, కథ బోరింగ్‌గా సాగడం స్ట్రైకర్ మూవీకి మైనస్‌గా మారింది.
విద్యా ప్రదీప్ తమిళంలో మారి 2, తాడం, కలరి, తలైవితో పాటు పలు సినిమాల్లో హీరోయిన్‌గా, క్యారెక్టర్ అర్టిస్ట్‌గా కనిపించింది. తమిళం, తెలుగు భాషల్లో కస్తూరి శంకర్ వందకుపైగా సినిమాలు చేసింది.