Itlu Maredumilli Prajaneekam Trailer: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్ వచ్చేసింది.. అల్లరి నరేష్ మరోసారి ఇరగదీశాడు
Itlu Maredumilli Prajaneekam Trailer: అల్లరి నరేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఏఆర్ మోహన్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా చేసింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.
Itlu Maredumilli Prajaneekam Trailer: టాలీవుడ్ హీరో అల్లరి నరేష్.. ఎప్పుడూ కామెడీ సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉంటాడు. అయితే గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో డీలా పడిన అల్లరోడు.. కంటెంట్ పరమైన చిత్రాలకు ఓటేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత గతేడాది వచ్చిన నాంది సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నరేష్.. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో వైవిధ్య భరితమైన కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం నటించిన సరికొత్త చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.
ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఓ మారుమూల ప్రాంతమైన మారేడుమిల్లిలో ఎలక్షన్ నిర్వహించేందుకుగానూ పోలింగ్ అధికారి పాత్రలో అల్లరి నరేష్ నటించాడు. ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. సాయం చేయమని మీరెన్ని సార్లు అడిగినా.. పట్టించుకోని ప్రతి ఆఫీసర్ సమాధానం చెప్పాలి అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో సాగింది. అంతేకాకుండా సామాజిక స్పృహను రేకెత్తించేలా ఉంది.
నటుడిగా అల్లరి నరేష్‌కు ఇదే 59వ చిత్రం. జాంబీరెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్ లాంటి చిత్రాలతో అలరించిన ఆనంది ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. వీరితో పాటు వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర, ప్రవీణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను అలరించి.. చిత్రంపై అంచనాలను పెంచేశాయి.
ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా చేస్తుంది. జీ స్టూడియోస్ సమర్పణలో, హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూరుస్తున్నారు. నవంబరు 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సంబంధిత కథనం
టాపిక్