నరేష్‌కు భలే ఛాన్స్.. ఇక ఆనందితో అల్లరి
కొంత కాలంగా కామెడీ కథాంశాలకు దూరంగా ఉంటూ ప్రయోగాలపై దృష్టి పెడుతున్న అల్లరి నరేష్ కొత్త సినిమా మంగళవారం హైదరాబాద్ పూజా కార్యక్రమాలతో మొదలైంది.
‘నాంది’ సినిమాతో గత ఏడాది కమర్షియల్ సక్సెస్ ను అందుకున్నారు అల్లరి నరేష్. అండర్ ట్రయల్ ఖైదీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆవిష్కరిస్తూ దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమాలో నరేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కొంత కాలంగా కామెడీ కథాంశాలకు దూరంగా ఉంటూ ప్రయోగాలపై దృష్టి పెడుతున్న అల్లరి నరేష్ కొత్త సినిమా మంగళవారం హైదరాబాద్ పూజా కార్యక్రమాలతో మొదలైంది.
ఈ చిత్రానికి ఏ.ఆర్ మోహన్ సంగీత దర్శకుడిగా వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో రాజేష్ దండ నిర్మిస్తున్నారు. ‘జాంబీరెడ్డి’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన తెలుగమ్మాయి ఆనంది ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా సాగే ఈ చిత్రంలో హీరో నరేష్ పాత్ర కొత్తగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు. అబ్బూరి రవి సంభాషణలు సమకూర్చుతున్నారు.