Bachchan Pandey| గద్దలకొండ గణేషా.. కాటమరాయుడా? బచ్చన్ పాండే ఎవరు? ట్రైలర్ చూడండి
అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన బచ్చన్ పాండే ట్రైలర్ శుక్రవారం రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూస్తే ఇలాంటి సినిమా ఇంతకుముందు ఎప్పుడో చూసినట్లు ఉందనే భావన తెలుగు ప్రేక్షకులకు కలుగుతోంది.
Bachchan Pandey | బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన బచ్చన్ పాండే ట్రైలర్ శుక్రవారం రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూస్తే ఇలాంటి సినిమా ఇంతకుముందు ఎప్పుడో చూసినట్లు ఉందనే భావన తెలుగు ప్రేక్షకులకు కలుగుతోంది. అవును.. ఇది తెలుగులో రీమేక్ అయిన 'గద్దలకొండ గణేష్' సినిమాకి రీరీమేక్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ చేసిన క్రూరమైన రాక్షస్ విలన్ గ్యాంగ్ లీడర్ పాత్రనే అక్షయ్ కుమార్ పోషిస్తున్నాడు. అయితే కథలో చిన్న తేడా! అదేమిటంటే.. తెలుగులో అథర్వ పోషించిన 'సినిమా డైరెక్టర్' పాత్రను ఇక్కడ గ్లామరస్ బ్యూటీ క్రితి సనన్ పోషిస్తుంది. ఇక, విలన్ కమ్ హీరో లవర్ అయిన పూజ హెగ్డే పాత్రను హిందీలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చేస్తుంది.
ఫుల్- టూ మాస్ యాక్షన్ సీన్లలో సీరియస్‌గా అనిపించే కామెడీని, కామెడీగా అనిపించే సీరియస్‌నెస్‌ని కలిపి అదిరిపోయే ఎంటర్టైనర్‌గా బచ్చన్ పాండే ట్రైలర్ ఉంది. మీరూ చూసేయండి.
Here's Bachchhan Paandey - Trailer:
మీకు ఇంకో విషయం తెలుసా..? ఈ సినిమా కథ కోసం ముందుగా పవన్ కళ్యాణ్ నటించిన 'కాటమరాయుడు' స్క్రిప్ట్ అనుకున్నారు. ఆ తర్వాత అదే రకమైన హీరో కమ్ విలన్ ఐడియాతోనే ఉన్న 'గద్దలకొండ గణేష్' స్క్రిప్ట్‌ను ఫిక్సయ్యారు. మరీ ఈ రీరీమేక్ 'బచ్చన్ పాండే' గద్దలకొండ గణేష్‌లా ఉంటాడా, కొద్దిగా కాటమరాయుడు టచ్‌తో రీరీరీమేక్‌లా అనిపిస్తాడా? అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.
మార్చి 18,2022న ఈ బచ్చన్ పాండే తెరపై రిలీజ్ అవుతున్నాడు.
సంబంధిత కథనం