Prabhas Adi purush: ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆదిపురుష్ ఫస్ట్ లుక్ రిలీజ్-adipurush first look to be unveiled on prabhas birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Adi Purush: ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆదిపురుష్ ఫస్ట్ లుక్ రిలీజ్

Prabhas Adi purush: ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆదిపురుష్ ఫస్ట్ లుక్ రిలీజ్

HT Telugu Desk HT Telugu
Sep 08, 2022 02:33 PM IST

Prabhas Adi purush: ప్ర‌భాస్ హీరోగా పౌరాణిక క‌థాంశంతో రూపొందుతున్న ఆదిపురుష్ సినిమా సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 12న రిలీజ్ కాబోతున్న‌ది. ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 23న స్పెష‌ల్ అప్‌డేట్‌తో చిత్ర యూనిట్ అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేయ‌బోతున్న‌ది. ఆ అప్‌డేట్ ఏదంటే...

<p>ప్ర‌భాస్&nbsp;</p>
ప్ర‌భాస్ (Twitter)

Prabhas Adi purush: ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న పాన్ ఇండియ‌న్ సినిమా ఆదిపురుష్ షూటింగ్ మొద‌లై రెండేళ్లు గ‌డుస్తోంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా నుంచి ప్ర‌భాస్ తో పాటు ఇత‌ర న‌టీన‌టుల ఫ‌స్ట్‌లుక్‌ పోస్టర్స్, టీజర్స్ రిలీజ్ చేయ‌లేదు. ముఖ్యంగా ప్ర‌భాస్ ఫ‌స్ట్‌లుక్ కోసం కొన్ని నెల‌లుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు . వారి నిరీక్ష‌ణ‌కు ప్ర‌భాస్ బ‌ర్త్‌డేతో తెర‌ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

yearly horoscope entry point

అక్టోబ‌ర్ 23న ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆది పురుష్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిసింది. స్పెష‌ల్ వీడియో గ్లింప్స్ కూడా విడుదలయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానుల‌కు భారీ స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు ఓంరౌత్ చెప్పాడు. ఎవ‌రు ఎక్స్‌పెక్ట్ చేయ‌ని విధంగా ఈ స‌ర్‌ప్రైజ్ ఉండ‌బోతున్న‌ట్లు పేర్కొన్నాడు. ఫస్ట్ లుక్ ను ఉద్దేశించే ఓంరౌత్ ఈ కామెంట్స్ చేసినట్లు అభిమానులు పేర్కొంటున్నారు. ప్ర‌భాస్ బ‌ర్త్‌డే రోజున స్పెష‌ల్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిసింది.

రామాయ‌ణ గాథ ఆధారంగా దాదాపు ఐదు వంద‌ల కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. త్రీడీ మోష‌న్ క్యాప్చ‌ర్ విధానంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌బోతుండ‌గా సీత పాత్ర‌లో కృతిస‌న‌న్ న‌టిస్తోంది. విల‌న్‌గా సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌బోతున్నారు. తెలుగు, హిందీతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం,క‌న్న‌డ భాష‌ల్లో సంక్రాంతి కానుకగా జనవరి 12న ఆది పురుష్ రిలీజ్ కానుంది. ఐమాక్స్ వెర్ష‌న్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను ప్ర‌స్తుతం విదేశాల్లో పూర్తి చేసే ప‌నిలో చిత్ర యూనిట్ ఉంది.

Whats_app_banner