Rashmika Tattoo : టాటూ సీక్రెట్ రివీల్ చేసిన రష్మిక మందన
Rashmika Mandanna Tattoo : రష్మిక మందన ఫొటోలు చూస్తే.. ఎక్కువగా టాటూ ఉన్నవే కనిపిస్తుంటాయి. అయితే దీనిపై రష్మిక స్పందించింది. టాటూ వేయించుకోవడానికి కారణం, ఎందుకని వేయించుకుందో వెల్లడించింది.
భారతీయ సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణులలో రష్మిక మందన్న(Rashmika Mandanna) కూడా ఉంది. బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప: ది రైజ్ తర్వాత ఆమె రేంజ్ పెరిగింది. ఈ సినిమాలో అల్లు అర్జున్(Allu Arjun) సరసన శ్రీవల్లి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గుడ్‌బైతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్ షేర్ చేసుంది. ఇక తాజాగా విడుదలైన వారసుడు సినిమాతోనూ ఆకట్టుకుంది.
రష్మిక(Rashmika) తరచుగా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే irreplaceable టాటూను ప్రదర్శిస్తూ ఉంటుంది, ఆమె ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తన కుడి చేతికి ఉన్న 'ఇర్రీప్లేసబుల్' అనే పదాన్ని ఎందుకు టాటూగా వేయించుకుందో వెల్లడించింది రష్మిక.
'మెుదట్లో ఏం చేయాలో తెలియదు. కానీ దానిని ఇప్పుడు పూర్తి చేశానని అనుకుంటున్నాను. మా కాలేజీలో ఓ అబ్బాయి వచ్చి, అమ్మాయిలు నొప్పిని తట్టుకోలేరని, సూదులు అంటే భయపడతారని చెప్పాడు. అయితే నేను దానికి ఒప్పుకోలేదు. అమ్మాయిలు అలా కాదు.. అని చూపిస్తానని, ఆపై టాటూ వేయించుకోవాలని అనుకున్నాను. కానీ ఏంటని మాత్రం తెలియదు.' అని రష్మిక తెలిపింది.
తనకు ఏం టాటూ కావాలో తెలియదని రష్మిక చెప్పింది. ఆపై కూర్చొని ఆలోచించానని, తాను తనలాగే ఉండాలని గ్రహించానని వెల్లడించింది. ఏ ఒక్కరూ మరొకరితో భర్తీ కారని రష్మిక పేర్కొంది. మన శక్తిని వేరొకరి శక్తితో భర్తీ చేయలేరని, మీరు మరెవరూ కాలేరని తెలిపింది. ఇదే విషయం అర్థం వచ్చేలా.. irreplaceable టాటూ వేయించుకున్నట్టుగా వివరించింది. మనమందరం స్వంత మార్గాలలో ముందుకు వెళ్తామని, ఎవరూ ఎవరినీ భర్తీ చేయలేరని రష్మిక అన్నది.
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన వారసుడులో దళపతి విజయ్(Thalapathy Vijay) సరసన రష్మిక నటించింది. తెలుగులో జనవరి 14న సినిమా విడుదలైంది. మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన స్పై థ్రిల్లర్ మిషన్ మజ్నులో కూడా రష్మిక కనిపించనుంది. ఈ చిత్రం జనవరి 20న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.