Telangana Election Results 2023 Updates : తెలంగాణలో కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ ఇస్తూ… మెజార్టీ స్థానాల్లో పాగా వేసే దిశగా వెళ్తోంది. తొలిసారిగా తెలంగాణ గడ్డపై హస్తం జెండా ఎగరవేసి… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అయితే ఈసారి ఫలితాల్లో కీలక నేతలు ఓడిపోయారు. మంత్రులు కూడా ఈ లిస్టులో ఉన్నారు. ఇక బీజేపీలో కీలకంగా వ్యవహరించిన ఆయన… ఈటల రాజేందర్ పరిస్థితి కూడా అలాగే ఉంది.
బీఆర్ఎస్ పార్టీని విబేధించి…బీజేపీలోకి వెళ్లిన ఈటల రాజేందర్ ఉపఎన్నికల్లో గెలిచి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత బీజేపీలో కీలకంగా మారారు. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నేరుగా కేసీఆర్ నే ఢీకొట్టాలని భావించి… హుుజరాబాద్ తో పాటు గజ్వేల్ నియోజకవర్గంలోనూ పోటీ చేశారు. అయితే ఈసారి సమీకరణాలు మారిపోయాయి. హుజురాబాద్ లోనే కాకుండా… గజ్వేల్ లోనూ వెనకబడ్డారు ఈటల. రెండు చోట్ల కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది. గజ్వేల్ లో కేసీఆర్ గెలిచే అవకాశం ఉండగా… హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి… ముందంజలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ బాబు కూడా గట్టి పోటీనిస్తున్నారు. ఓ దశలో రెండో స్థానంలో ఉండగా… ఈటల మూడో ప్లేస్ కు పడిపోయారు. చివరి రౌండ్ వరకు ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు దుబ్బాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందర్ రావు కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయనపై బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు.