NDA Alliance in AP : ఓటింగ్ శాతంపై కూటమి గురి..! 'Friday ఊరెళ్దాం, Monday ఓటేద్దాం' పేరుతో క్యాంపెయినింగ్..!
AP Elections 2024 Updates: ఏపీలో పోలింగ్ శాతం భారీగా ఉండాలని ఎన్డీయే కూటమి భావిస్తోంది. ఇందుకోసం సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారిని ఓటింగ్ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని చూస్తోంది.
NDA Alliance Social Media Campaign : ఏపీలో ఓటింగ్ శాతం పెంచేందుకు సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బిజెపీ కూటమి వినూత్నంగా ప్రచారం చేపట్టింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారిని మే 13న ఓటింగ్ కు రప్పించేందుకు ప్రచారం చేస్తోంది. ‘శుక్రవారం బయలుదేరి రండి....సోమవారం ఓటేయండి’ అంటూ పిలుపునిస్తూ క్యాంపెయినింగ్ చేస్తూ… సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తోంది.
ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారిని స్వాగతిస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రచారానికి ఎన్డీయే కూటమి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం పలు స్లోగన్స్ తో పోస్టర్లను విడుదల చేసింది. “హైదరాబాద్ నుంచి మన ఆంధ్రాకు వెళదాం..... మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం!” అంటూ ఇందులో రాసుకొచ్చింది.
చెన్నైలో బస్సెక్కి మన చిత్తూరు వెళదాం... మేలు చేసే వారికి ఓటేద్దాం", బెంగుళూరులో ట్రైన్ ఎక్కి మన బెజవాడ వెళదాం.... అభివృద్ది పాలకులకు అవకాశం ఇద్దాం! అంటూ ఓటర్లను ఆలోచనలో పడేసే ప్రయత్నం చేస్తోంది.
ఈ తరహా క్యాంపెయినింగ్ కు కూడా ఓ లెక్క ఉంటుందని భావిస్తోంది ఎన్డీయే కూటమి. ఏపీలో ఓటింగ్ శాతం ఎంత పెరిగితే.....కూటమికి అంత లాభం అని కూటమిలోని నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. భారీగా నమోదైన పోస్టల్ బ్యాలెంట్ తో ఇప్పటికే ట్రెండ్ సెట్టైయ్యిందంటుని కూటమి భావిస్తోంది.
పెరుగుతున్న రద్దీ…!
ఏపీలో మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. అయితే ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు పోలింగ్ లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఇప్పటికే ప్రయాణాలు మొదలయ్యాయి.
మే 13 పోలింగ్ తేదీకి ముందే ఏపీవోని తమ గ్రామాలకు వచ్చేందుకు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజల ప్రయత్నాలు చేస్తున్నారు. దసరా, సంక్రాంతి పండగల మాదిరిగా మూడు రోజుల ముందుగానే బస్ స్టాండ్ లు, రైల్వే స్టేషన్లలో రద్దీ మొదలైంది. ఏపీకి రేపు, ఎల్లుండి ప్రయాణాలకు పెద్ద ఎత్తున రిజర్వేషన్లు బుకింగ్ అయ్యాయి.
ట్రైన్ రిజర్వేషన్ల కోసం ప్రయాణికుల ప్రయత్నాలు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ కు మంచి స్పందన రాగా…. మే 13వ తేదీన ఓటింగ్ భారీగా పెరిగే అవకాశం ఉందంటుందని అధికారులు భావిస్తున్నారు.
మూడు రోజులు సెలవు కావడంతో చాలా మంది ఓటర్లు సొంత ఊరు వెళ్లి ఓటు వెయ్యాలనే ఆలోచనతో ఉన్నారు. దీంతో సొంత గ్రామాలకు బయల్దేరుతున్నారు. సొంత వాహనాల్లో కూడా చాలా మంది ప్రజలు స్వగ్రామాకు వెళ్తున్నారు. దీంతో ఏపీ వైపు వెళ్లే వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు రోడ్లపై కూడా రద్దీ విపరీతంగా ఉంటోంది.
ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది తలపడుతుంటే 175 అసెంబ్లీ స్థానాలకు 2387మంది పోటీలో నిలిచారు.వచ్చే నెల 13 న జరుగనున్న ఎన్నికల్లో వీరంతా వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులుగా ఎన్నికల్లో పోటీ పడనున్నారు.
అసెంబ్లీ స్థానాలకు సంబందించి అత్యధికంగా 46 మంది అభ్యర్థులు తిరుపతి నియోజక వర్గంలో పోటీ చేస్తున్నారు. అత్యల్పంగా 6గురు అభ్యర్థులు చోడవరం అసెంబ్లీ నియోజక వర్గంలో పోటీపడుతున్నారు.
పార్లమెంటు నియోజక వర్గాలకు సంబంధించి అత్యధికంగా విశాఖ పార్లమెంటు స్థానానికి 33 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాజమండ్రిలో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
టాపిక్