Kangana Ranaut : లోక్‌సభ ఎన్నికల్లో కంగనా రనౌత్‌కు బీజేపీ టికెట్!
Kangana Ranaut Lok Sabha elections : 2024 లోక్‌సభ ఎన్నికల్లో కంగనా రనౌత్ పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఆమెకు బీజేపీ టికెట్ ఇస్తుందని తెలుస్తోంది.
2024 Lok Sabha elections : ప్రముఖ నటి కంగనా రనౌత్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హార్డ్ కోర్ ఫ్యాన్‌గా పేరొందిన కంగనా రనౌత్‌ను ఎన్నికల బరిలో దింపాలని బీజేపీ భావిస్తోందట!
కంగనా రనౌత్‌కు బీజేపీ టికెట్..!
పలు మీడియా నివేదికల ప్రకారం.. బీజేపీ పార్టీ తరఫును కంగనా రనౌత్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్ మండీ లోక్‌సభ సీటు నుంచి ఆమెను బరిలో దింపాలని కమల దళం భావిస్తోంది.
గతేడాది.. తన రాజకీయ అరంగేట్రం, ఎన్నికల్లో పోటీ విషయంపై స్పందించారు కంగనా రనౌత్.
"శ్రీ కృష్ణుడి ఆశిస్సులు ఉంటే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తాను," అని ఆమె అన్నారు.
మోదీపై తనకి ఉన్న అభిమానాన్ని అనేకమార్లు బహిరంగంగానే చెప్పారు 37ఏళ్ల రనౌత్.
Kangana Ranaut BJP : "ఒక యంగ్ ఉమెన్‌గా.. మనందరికి సరైన రోల్ మోడల్స్ ఉండాలని నేను విశ్వసిస్తాను. ఒక చాయ్‌వాలా లాంటి వ్యక్తి ప్రధాని పదవిలో ఉంటే.. అది ఆయన విజయం కాదు, ప్రజాస్వామ్య విజయం అని నేను నమ్ముతాను. రోల్ మోడల్ అయ్యే అన్ని అర్హతలు మోదీకి ఉన్నాయని నేను అనుకుంటున్నాను," అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు కంగనా రనౌత్.
జనవరి 22న, అట్టహాసంగా జరిగిన రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలో కంగనా కూడా పాల్గొన్నారు. "రాముడు వచ్చాడు" అంటూ ట్విట్టర్లో ఫొటోలను షేర్ చేశారు.
సినీ తారలను ఎన్నికల బరిలో దింపడం రాజకీయ పార్టీలకు అలవాటే! గతంలో ప్రముఖ నటుడు సన్నీ డియోల్, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌లను లోక్‌సభ ఎన్నికల బరిలో దింపింది బీజేపీ. మరో మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ని 2024 లోక్‌సభ ఎన్నికల బరిలో దింపుతోంది తృణమూల్ కాంగ్రెస్.
Kangana Ranaut Lok Sabha elections : కంగనా రనౌత్ నటించిన 'ఎమర్జెన్సీ' సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. కన్నప్ప సినిమాలో కూడా ఆమె నటిస్తున్నారు. అంతేకాకుండా.. తను వెడ్స్ మనూ పార్ట్-3 కి ఆమె షూటింగ్ ప్రారంభించారు. కంగనా నటించిన 'థలైవీ' సినిమాను తెరకెక్కించిన డైరక్టర్ విజయ్.. ఈ సినిమా రూపొందిస్తున్నారు. వీటితో పాటు క్వీన్ 2 కూడా సిద్ధమవుతోందని సమాచారం.
మరి.. కంగనా రనౌత్‌కు బీజేపీ టికెట్ దక్కుతుందో లేదో.. ఇంకొన్ని రోజుల్లో తేలిపోతుంది. ఆమె గెలుస్తారా? లేదా? అనేది జూన్‌లో వెలువడే ఎన్నికల ఫలితాలతో తెలిసిపోతుంది.
సంబంధిత కథనం