Lok Sabha election results : వారణాసిలో మోదీ వెనకంజ.. ఎన్డీఏకి బలమైన పోటీ ఇస్తున్న ఇండియా!
Lok Sabha election results 2024 live updates : లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్డీఏకి ఇండియా కూటమి బలమైన పోటీ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. వారణాసిలో మోదీ వెనకంజలో ఉండటం గమనార్హం.
Lok Sabha election results news : లోక్‌సభ ఎన్నికల ఫలితాల వేళ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ జోరు కొనసాగుతోంది. కానీ.. విపక్ష ఇండియా కూటమి సైతం బలమైన పోటీ ఇస్తోంది. కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు ప్రారంభం అవ్వగా.. ఉదయం 9:30 గంటలకు ఉన్న ట్రెండ్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024- ఎన్డీఏ వర్సెస్ ఇండియా..
లోక్‌సభలో 543 సీట్లకు మెజారిటీ మార్క్ 272గా ఉంది. కౌంటింగ్‌కి ముందే.. గుజరాత్ సూరత్ బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా గెలిచారు. ఆ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక 542 సీట్లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదటి అరగంట.. పోస్ట్ బ్యాలెట్‌లోని ఓట్లను లెక్కించారు. ప్రస్తుతం.. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
Lok Sabha election results 2024 live updates : కాగా.. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. ఎన్డీఏ కూటమి 240 స్థానాల్లో లీడ్‌లో ఉంది. విపక్ష ఇండియా కూటమి, ఊహించిన దాని కన్నా మెరుగైన ప్రదర్శనే చేస్తోంది! ప్రస్తుతం.. 183 సీట్లల్లో లీడింగ్‌లో ఉంది. ఇతరులు 20 చోట్ల ముందంజలో ఉన్నారు.
మరోవైపు.. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం.. యూపీ వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనకంజలో ఉన్నారు. ప్రస్తుతానికి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన అజయ్ రాయ్‌కి 11,480 ఓట్లు వచ్చాయి. మోదీకి 5257 ఓట్లు పోల్ అయ్యాయి.
రాష్ట్రాల వారీగా..
ఉత్తర్ ప్రదేశ్- ఎన్డీఏ 40, ఎస్పీ 35, ఇతరులు 1
మహారాష్ట్ర- ఎన్డీఏ 23, కాంగ్రెస్ 19, ఇతరులు 2
పశ్చిమ్ బెంగాల్- టీఎంసీ 24, బీజేపీ 12, కాంగ్రెస్ 3, ఇతరులు 0
బిహార్- ఎన్డీఏ 21, ఆర్జేడీ 5, ఇతరులు 0
Lok Sabha election results BJP : తమిళనాడు- ఇండియా 28, అన్నాడీఎంకే 2, బీజేపీ 0, ఇతరులు 0
మధ్యప్రదేశ్- బీజేపీ 28, కాంగ్రెస్ 0, ఇతరులు 0
కర్ణాటక- బీజేపీ 23, కాంగ్రెస్ 5, ఇతరులు 0
గుజరాత్- బీజేపీ 24, కాంగ్రెస్ 2, ఇతరులు 0
ఆంధ్రప్రదేశ్- ఎన్డీఏ 10, కాంగ్రెస్ 1, వైసీపీ 1, ఇతరులు 0
సంబంధిత కథనం