Lok Sabha election results : కౌంటింగ్​ ప్రారంభానికి ముందే తొలి సీటు గెలిచిన బీజేపీ- ఎవరంటే..-lok sabha election results why bjp won 1 seat before counting began ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Election Results : కౌంటింగ్​ ప్రారంభానికి ముందే తొలి సీటు గెలిచిన బీజేపీ- ఎవరంటే..

Lok Sabha election results : కౌంటింగ్​ ప్రారంభానికి ముందే తొలి సీటు గెలిచిన బీజేపీ- ఎవరంటే..

Sharath Chitturi HT Telugu
Jun 04, 2024 08:20 AM IST

Lok Sabha election results : లోక్​సభ ఎన్నికల ఫలితాల్లో కౌంటింగ్​ ప్రారంభానికి ముందే.. బీజేపీకి తొలి గెలుపు లభించింది. ఇదెలా సాధ్యమైందంటే..

కౌంటింగ్​ ప్రారంభానికి ముందే తొలి సీటు గెలిచిన బీజేపీ- ఎవరంటే..
కౌంటింగ్​ ప్రారంభానికి ముందే తొలి సీటు గెలిచిన బీజేపీ- ఎవరంటే..

Lok Sabha election results : 2024 లోక్​సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన కౌంటింగ్​ ప్రక్రియ.. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కాగా.. కౌంటింగ్​ ప్రారంభానికి ముందే.. బీజేపీ ఒక సీటును తన ఖాతాలో వేసుకుంది. సూరత్​ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ముకేశ్​ దలాల్​ గెలుపొందారు. అది ఎలా సాధ్యమైందంటే..

బీజేపీ ఖాతాలో ఇప్పటికే ఒక సీటు..

గుజరాత్​లోని సూరత్ లోక్​సభ స్థానానికి.. బీజేపీ అభ్యర్థి ముకేశ్​ దలాల్​తో పాటు కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ వేశారు. కానీ నీలేష్​ నామినేషన్​ తిరస్కరణకు గురైంది. ఎన్నికలకు ముందు ఇతర అభ్యర్థుల సంతకాల్లో అవకతవకలు జరిగాయని ఈసీ తెలిపింది. ఫలితంగా ముకేశ్​ మినహా అందరు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఫలితంగా.. ముకేశ్​ దలాల్​ రూపంలో బీజేపీకి తొలి విజయం దక్కింది.

ఫలితంగా.. 543 సీట్లకు కాకుండా.. 542 సీట్లకు నేడు కౌంటింగ్​ జరుగుతోంది.

Lok Sabha election results BJP : అయితే.. పోటీలో ఉన్న ఇతర అభ్యర్థులు ఒత్తిడితో నామినేషన్లను ఉపసంహరించుకున్నప్పుడు మాత్రమే ఎన్నికల సంఘం జోక్యం చేసుకుంటుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్​ సోమవారం తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయని పక్షంలో ఒక వ్యక్తిని విజేతగా ప్రకటించకూడదనే నిబంధన చట్టప్రకారం ఉండకపోవచ్చని ఆయన సూచించారు. లోక్​సభ, అసెంబ్లీలకు ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు 'పైవేవీ ఉండవు' అనే అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై విలేకరుల సమావేశంలో అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.

ఓట్ల లెక్కింపు..

లోక్​సభ ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్​, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన తాజా అప్డేట్స్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

2024 Lok Sabha election results : ఏపీ, ఒడిశాతో పాటు అరుణాచల్​ ప్రదేశ్​, సిక్కింలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాగా.. ఈ రెండు రాష్ట్రాల్లో ఫలితాలు ఆదివారమే వెలువడ్డాయి. అరుణాచల్​ ప్రదేశ్​లో బీజేపీ గెలిచింది. సిక్కింలో అధికార ఎస్​కేఎం సునామీ ముందు విపక్షాలేవీ నిలవలేకపోయాయి.

Whats_app_banner

సంబంధిత కథనం