Karimnagar News : కరీంనగర్ లో స్వతంత్ర అభ్యర్థి వినూత్నంగా నామినేషన్, రూ.25 వేల కాయిన్స్ తో ఎన్నికల డిపాజిట్-karimnagar lok sabha elections independent candidate filed nomination with 25k coins ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Karimnagar News : కరీంనగర్ లో స్వతంత్ర అభ్యర్థి వినూత్నంగా నామినేషన్, రూ.25 వేల కాయిన్స్ తో ఎన్నికల డిపాజిట్

Karimnagar News : కరీంనగర్ లో స్వతంత్ర అభ్యర్థి వినూత్నంగా నామినేషన్, రూ.25 వేల కాయిన్స్ తో ఎన్నికల డిపాజిట్

HT Telugu Desk HT Telugu
Apr 24, 2024 07:54 PM IST

Karimnagar News : నామినేషన్ తోనే ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు స్వతంత్ర అభ్యర్థి. కరీంనగర్ లోక్ సభ స్థానానికి నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి మానస రెడ్డి..తన డిపాజిట్ ను చిల్లర రూపంలో చెల్లించారు.

 స్వతంత్ర అభ్యర్థి వినూత్నంగా నామినేషన్
స్వతంత్ర అభ్యర్థి వినూత్నంగా నామినేషన్

Karimnagar News : ఎన్నికలు (General Elections)అనగానే విచిత్రాలు జరుగుతాయి. ఎన్నికల్లో తమ ప్రత్యేకతను చాటుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తారు. అలానే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం(Karimnagar Lok Sabha) నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మానస రెడ్డి వెరైటీగా నామినేషన్(Nomination) దాఖలు చేశారు. నెత్తిన బుట్ట.. బుట్టలో చిల్లర కాయిన్స్(Coins).. చేతిలో నామినేషన్ పత్రాలతో కరీంనగర్ కలెక్టరేట్ కు చేరారు మానస రెడ్డి. గేటు వద్ద పోలీసులు ఆమెను అడ్డగించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చి అందరూ అవ్వాక్కయ్యారు. ఇదిగో చూడండి నేను నామినేషన్ వేసేందుకు వచ్చాను.. బుట్టలో డబ్బులు చేతిలో పత్రాలు పక్కన బలపరిచిన అభ్యర్థులు అంటూ చెప్పడంతో ఖంగుతిన్న అదికారులు నవ్వుకుంటూ లోపలికి పంపారు. బుట్టలోని కాయిన్స్ తో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రమేలా సత్పతి వద్దకు వెళ్లి నామినేషన్ పత్రాలు అందజేశారు.

ఓటర్లు ఇచ్చిన కాయిన్స్ తో నామినేషన్

మానసరెడ్డి డిపాజిట్(Election Deposit) కింద ఎన్నికల అధికారులకు సమర్పించిన 25 వేల రూపాయల కాయిన్స్ ఓటర్లే ఇచ్చారట. ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రోత్సహిస్తూ ఎన్నికల ఖర్చు కింద తెలినవారు రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయల కాయిన్స్ అందజేసినట్లు మానసరెడ్డి తెలిపారు. ఓటర్లు ఇచ్చిన డబ్బులు వృథా చేయకుండా నామినేషన్ డిపాజిట్ కింద 25 వేల రూపాయల కాయిన్స్ అందజేసినట్లు చెప్పారు. మొత్తం 30 వేల రూపాయల కాయిన్స్ సమకూరగ రూ.25 వేలు డిపాజిట్ ఇవ్వగా మరో ఐదు వేల రూపాయల కాయిన్స్ ఉన్నట్లు తెలిపారు. ఓటర్ల ప్రోత్సాహంతో ఎన్నికల(Lok Sabha Elections) బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు.

నామినేషన్ తోనే అట్రాక్షన్

తొలిసారి పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament Elections) పోటీ చేస్తున్న మానస రెడ్డి నామినేషన్ దాఖలుతోనే అట్రాక్షన్ గా నిలిచారు.‌ నామినేషన్ ప్రక్రియ నుంచే ఆకట్టుకునే విధంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటరు నాడిని పట్టేందుకు చేయని ప్రయత్నం ఉండదు. కానీ నామినేషన్ తోనే ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు మానస రెడ్డి చేసిన ప్రయత్నం అబ్బుర పరిచి, అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.

HT Telugu Correspondent K.V.REDDY, Karimnagar

WhatsApp channel

సంబంధిత కథనం