BRS to Congress : ఆపరేషన్ ఆకర్ష్....! హస్తం గూటికి సిట్టింగ్ ఎంపీ, అదే బాటలో ఎమ్మెల్యే..?
Telangana Politics : బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు వెళ్లగా… లిస్ట్ లో మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ఓ సిట్టింగ్ ఎంపీతో పాటు మరో ఎమ్మెల్యే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
BRS to Congress : అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బిఆర్ఎస్ పార్టీకి(BRS Party) పార్లమెంట్ ఎన్నికల ముందు రోజుకో షాకు తగులుతుంది.ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో అనేక మంది నేతలు గులాబీ పార్టీకి రాజీనామ చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ,వికారాబాద్ జిల్లా చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా......ఇక అదే బాటలో ఇప్పుడు చేవెళ్ల బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి(MP Ranjith reddy) మరియు చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
చేవెళ్ల ఎంపి టికెట్ ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరిన పట్నం సునీత మహేందర్ రెడ్డి కి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చేసిన సర్వేలో సునీత మహేందర్ రెడ్డికి అనుకూలంగా ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ సునీత మహేందర్ రెడ్డికి టికెట్ నిరాకరించినట్లు తెలుస్తుంది.అయితే సిట్టింగ్ ఎంపి రంజిత్ రెడ్డికే సర్వేలు మొగ్గు చూపడంతో ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని చేవెళ్ల టికెట్ కేటాయించే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందంట….!
కాంగ్రెస్ లోకి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ,ఎమ్మెల్యే ?
ఇక చేవెళ్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా ఎంపీ రంజిత్ రెడ్డి వెంటే ఉండి బిఆర్ఎస్ పార్టీని వీడి.... కాంగ్రెస్ పార్టీలో చేరుతారని సమాచారం.గత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన అయన బిఆర్ఎస్ లోకి వెళ్లి 2018లో బీఆర్ఎస్ నుంచి మరోసారి గెలిచారు. ఇక ఇటీవలే జరిగిన 2023 ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు అని ప్రచారం జరుగుతుంది.కాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే.చేవెళ్ల ఎంపీ టికెట్ పై ఇప్పటికే అనేక మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. వికారాబాద్ జిల్లా చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి,తీగల కృష్ణారెడ్డి లు చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశించగా....సర్వే లో వీరికి వ్యతిరేకంగా రిపోర్ట్ రావడంతో కాంగ్రెస్ రంజిత్ రెడ్డికే ఒకే చెబుతుందట.దీంతో అధిష్టానం రంజిత్ రెడ్డికి టికెట్ దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం.
కాంగ్రెస్ లోకి గుత్తా సుఖేందర్,గుత్తా అమిత్ ?
గత కొన్ని రోజులుగా గులాబీ పార్టీ పై గుర్రు మంటున్న గుత్తా సుఖేందర్ రెడ్డి.......తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై(CM Revanthreddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పాలన బాగుందని అయన పాలనను ప్రజలు మెచ్చుకుంటున్నారు అంటూ గుత్తా సుఖేందర్ రెడ్డ) చేసిన వ్యాఖ్యలు ప్రస్తూత్రం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం లేపుతున్నయి. సిఎం రేవంత్ రెడ్డి తనకు బందూవు అని అసెంబ్లీ సమావేశాలు మినహా ఎక్కడా ఆయనను ఎక్కువగా కలవలేదను అయన స్పష్టం చేశారు.బిఆర్ఎస్ పార్టీ ఆలస్యం చేయకుండా నల్గొండ ఎంపి అభ్యర్థిని ప్రకటిస్తే బాగుండేదని అయన మనసులో మాట చెప్పారు. కొందరి నేతల జోక్యం వల్ల తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పోటీలో ఉండాలి అనుకోవడం లేదన్నారు.పలు మార్లు తనను బిఅర్ఎస్ లోని ఆహ్వానిస్తే నే తాను కారు పార్టీలో చేరినట్లు సుఖేందర్ రెడ్డి వెల్లడించారు.కాగా గత కొంతకాలంగా బిఆర్ఎస్ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డికి గుత్తా సుఖేందర్ రెడ్డికి అంతర్గతంగా పడడం లేదన్న ప్రచారం జరిగింది.దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు అతడి కుమారుడు గుత్తా అమిత్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని ప్రచారం జరుగుతుంది.
ఇవాళ హైదరాబాద్ నగరానికి చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో ఆయన పార్టీ మారబోతున్నారని తెలుస్తోంది.