Mizoram election results : మిజోరంలో ఆ రెండు ప్రాంతీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు!
Mizoram election results : మిజోరంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రెండు ప్రాంతీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది.
Mizoram election results : మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం.. అధికార మిజో నేషనల్ ఫ్రెంట్- జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. ఈ రెండు కూడా ప్రాంతీయ పార్టీలే!
మిజోరం ఎన్నికల ఫలితాలు 2023..
మిజోరంలో మొత్తం 40 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 21 సీట్ల మెజారిటీ అవసరం ఉంది. ఉదయం 9:20 గంటల వరకు.. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం.. సీఎం జోరంథంగ నేతృత్వంలోని ఎమ్ఎన్ఎఫ్.. 14 సీట్ల ఆధిక్యంలో ఉంది. విపక్ష జెడ్పీఎం.. 12 సీట్లల్లో లీడ్‌లో ఉంది. ఫలితంగా.. ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక వీటికి దూరంగా.. కాంగ్రెస్ కేవలం 2 సీట్లల్లో లీడ్‌లో ఉండగా.. ఇతరులు.. 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Mizoram election results live updates : వాస్తవానికి ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌తో పాటు.. మిజోరం ఎన్నికల ఫలితాలు కూడా ఆదివారమే వెలువడాల్సి ఉంది. కానీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారానికి వాయిదా పడింది.
మిజోరంలో నవంబర్ 7న ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో మొత్తం 8.57లక్షల మంది ఓటర్లు ఉండగా.. 80.66శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Mizoram election results 2023 live : 2018లో అప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను గద్దె దించి.. ఎమ్ఎన్ఎఫ్ అధికారంలోకి వచ్చింది. నాడు.. 26 సీట్లల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడే కొత్తగా ఏర్పడిన జెడ్పీఎంకు 8 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కేవలం 5 స్థానాలకే పరిమితమైంది బీజేపీ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకుంది.
తాజా ఎన్నికల్లో ఎమ్ఎన్ఎఫ్, జెడ్పీఎం, కాంగ్రెస్‌లు మొత్తం 40 సీట్లల్లో పోటీ చేశారు. బీజేపీ మాత్రం 23 అభ్యర్థులతోనే బరిలో దిగింది.
సంబంధిత కథనం