EC Transfers AP Officials : ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీపై ఈసీ బదిలీ వేటు-ఎన్నికల విధులు అప్పగించొద్దని ఆదేశాలు-amaravati ec transfers ap intelligence chief psr anjaneyulu vijayawada cp kanthi rana tata ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ec Transfers Ap Officials : ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీపై ఈసీ బదిలీ వేటు-ఎన్నికల విధులు అప్పగించొద్దని ఆదేశాలు

EC Transfers AP Officials : ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీపై ఈసీ బదిలీ వేటు-ఎన్నికల విధులు అప్పగించొద్దని ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Apr 23, 2024 08:59 PM IST

EC Transfers AP Officials : ఎన్నికల వేళ ఏపీలో కీలక అధికారులపై ఈసీ కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా ఇద్దరు అధికారులపై బదిలీ వేటు చేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీలను బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీపై ఈసీ బదిలీ వేటు
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీపై ఈసీ బదిలీ వేటు

EC Transfers AP Officials : ఏపీలోని కీలక అధికారులపై ఈసీ(EC Transfers) బదిలీ వేటు చేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్(AP Intelligence Chief) పి.సీతారామాంజనేయులు, విజయవాడ సీపీ(Vijayawada CP) కాంతి రాణా టాటాపై ఈసీ వేటు వేసింది. వీరిద్దరికీ ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ అధికారులపై ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈ ఇద్దరు అధికారులు అధికారపార్టీతో అంటకాగుతున్నారని ఆరోపణలు చేశాయి. విజయవాడలో సీఎంపై రాయి దాడి ఘటనలో దర్యాప్తు సరిగ్గా లేదని టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విజయవాడ సీపీని ఈసీ వివరణ కోరింది. ఇంటిలిజెన్స్ చీఫ్‍పై కూడా పెత్తఎత్తున ఆరోపణలు వచ్చాయి. వీరిద్దరూ ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాలను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించాయి. ఈ ఫిర్యాదులపై విచారించిన ఈసీ.. వీరిని బదిలీ చేయాలనీ సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశించింది. వీరి స్థానంలో ముగ్గురి పేర్లతో ప్యానెల్ పంపాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశించింది.

రేపటిలోగా ప్యానల్ పంపాలని ఆదేశాలు

ఏపీ ఇంటెలిజెన్స్ డీజీపీ పి.సీతారామాంజనేయులు, విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటాలను తక్షణమే బదిలీ చేయాలని ఈసీ...సీఎస్ ను ఆదేశించింది. వీరిద్దరూ తక్షణమే తన విధులు.. తన కింద అధికారులకు అప్పగించి బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. ఎన్నికలు ముగిసే వరకు వీరికి ఎలాంటి ఎన్నికల సంబంధిత విధులు అప్పగించొద్దని తెలిపింది. ఈ రెండు పోస్టులకు రేపు(ఏప్రిల్ 24) మధ్యాహ్నం 3 గంటల లోపు ముగ్గురు ఏడీజీపీ, ముగ్గురు ఐపీఎస్ ర్యాంకు అధికారుల పేర్లతో ప్యానల్ పంపాలని సీఎస్ ను ఆదేశించింది ఈసీ.

వెంకట్రామిరెడ్డిపై వేటు

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని(Venkatrami Reddy) ఎన్నికల సంఘం ఇటీవల సస్పెండ్(Suspension) చేసింది. ఈసీ(Election Commission) ఆదేశాలతో పంచాయితీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. వెంకట్రామిరెడ్డి సస్పెన్షన్ కాలంలో హెడ్‌క్వాటర్స్‌ దాటి వెళ్లొద్దని ఈసీ ఉత్తర్వుల్లో తెలిపింది. వెంకట్రామిరెడ్డి కడప జిల్లా బద్వేలులో వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం(Election Campaign)లో పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమైన ఆయన వైసీపీకి ఓటు వేయాలని కోరారని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. కడప జిల్లా కలెక్టర్‌ నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకుంది. వెంకట్రామిరెడ్డి పంచాయతీరాజ్‌ శాఖలో అసిస్టెంట్‌ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ

ఎన్నికల (AP Elections)నేపథ్యంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ(AP Beverages Corp MD) వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని ఇటీవల ఈసీ ఆదేశించింది. తన దిగువ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి తక్షణమే విధుల్లోంచి తప్పుకోవాలని వాసుదేవరెడ్డిని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వాసుదేవరెడ్డికి(Vasudeva Reddy) ఎలాంటి ఎన్నికల విధుల్ని అప్పగించొద్దని ఈసీ స్పష్టం చేసింది. మద్యం ఉత్పత్తి, విక్రయాల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై వాసుదేవరెడ్డిపై చర్యలు ఈసీ చర్యలు తీసుకుంది.

సంబంధిత కథనం