Asia Cup Opening Ceremony: ఆసియా కప్ ఓపెనింగ్ సెర్మనీలో మెరిసిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?-who is trishala gurung stars in asia cup opening ceremony cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Asia Cup Opening Ceremony: ఆసియా కప్ ఓపెనింగ్ సెర్మనీలో మెరిసిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

Asia Cup Opening Ceremony: ఆసియా కప్ ఓపెనింగ్ సెర్మనీలో మెరిసిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?

Hari Prasad S HT Telugu
Aug 31, 2023 07:54 AM IST

Asia Cup Opening Ceremony: ఆసియా కప్ ఓపెనింగ్ సెర్మనీలో ఓ నేపాలీ బ్యూటీ ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసింది. ఆమె అందం, పాడిన తీరు ఎంతగానో నచ్చేయడంతో ఇప్పుడామె వైరల్ గా మారింది.

ఆసియా కప్ ఓపెనింగ్ సెర్మనీలో పాడుతున్న త్రిషాలా గురుంగ్
ఆసియా కప్ ఓపెనింగ్ సెర్మనీలో పాడుతున్న త్రిషాలా గురుంగ్ (AP)

Asia Cup Opening Ceremony: ఆసియా కప్ 2023 బుధవారం (ఆగస్ట్ 30) ప్రారంభమైంది. టోర్నీ ప్రారంభానికి ముందు ఓపెనింగ్ సెర్మనీ కూడా నిర్వహించారు. అయితే ఇందులో ఓ నేపాలీ సింగర్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమె అందం, పాడిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె ఎవరా అని ఆరా తీయడం మొదలు పెట్టడంతో ఈ సెర్మనీ తర్వాత వైరల్ గా మారిపోయింది.

ఈ సింగర్ పేరు త్రిషాలా గురుంగ్ (Trishala Gurung). పాకిస్థాన్ ఫేమస్ సింగర్ ఐమా బేగ్ తో కలిసి ఆసియా కప్ ఓపెనింగ్ సెర్మనీలో త్రిషాలా పర్ఫామ్ చేసింది. సాంప్రదాయ చీరకట్టు, మెస్మరైజ్ చేసే వాయిస్ తో గురుంగ్ ఈ సెర్మనీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఎవరీ త్రిషాలా గురుంగ్?

త్రిషాలా గురుంగ్ ((Trishala Gurung)) ఓ పాపులర్ నేపాలీ సింగర్. ఆ దేశంలో ఆమెకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వృత్తిపరంగా డాక్టర్ అయిన ఆమె సింగింగ్ తోపాటు పాటలు రాస్తుంది. మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తుంది. మోడలింగ్ లోనూ ఆమెకు పేరుంది. అందానికి అందం, మంచి వాయిస్, మల్టీ టాలెంట్స్ తో నేపాల్ ను ఈ త్రిషాలా ఓ ఊపే ఊపేస్తోంది.

28 ఏళ్ల గురుంగ్ నేపాల్ మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ చదివింది. ఏదో సరదాగా పాటలు పాడుతూ వాటిని సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తూ వచ్చేది. అవి కాస్తా వైరల్ కావడంతో పెద్ద స్టార్ గా మారిపోయింది. నాలుగేళ్ల కిందట "యో మన్" పేరుతో తొలి పాటను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆమెకు ఓ యూట్యూబ్ ఛానెల్ ఉండగా.. అందులో 1.95 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈమె నేపాల్ మ్యూజిక్ ఇండస్ట్రీకే చెందిన రోహిత్ షక్యాను పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వీళ్ల పెళ్లి జరిగింది.

ఆసియా కప్ ఓపెనింగ్ సెర్మనీలో పాడిన తర్వాత త్రిషాలా గురుంగ్ మరింత పాపులర్ అయిపోయింది. ఈ సెర్మనీ ముగిసిన వెంటనే సోషల్ మీడియాలో ఆమె పేరు వైరల్ అయింది. ఇంతకీ ఎవరీ నేపాలీ అందం అంటూ సెర్చ్ చేసేస్తున్నారు. తెల్లటి చీర, గాజులు, బొట్టు.. ఇలా పూర్తి సాంప్రదాయబద్ధంగా ఓపెనింగ్ సెర్మనీలో కనిపించడం మరింత ఆకర్షించింది.