Gautam Gambhir: టీ20ల్లో టీమిండియా తరఫున స్టోయెస్ట్ హాఫ్ సెంచరీ చేసింది గౌతమ్ గంభీర్ - మ్యాచ్‌లో ట్విస్ట్ ఏంటంటే?
Gautam Gambhir: టీ20ల్లో టీమిండియా తరఫున స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన చెత్త రికార్డ్ గౌతమ్ గంభీర్ పేరిట ఉంది. 2012లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో గంభీర్ 54 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. అయినా ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవడం గమనార్హం.
Gautam Gambhir: టీ20 అంటేనే విధ్వంసానికి చిరునామాగా చెబుతుంటారు. ఈ ఫార్మెట్‌లో హిట్టర్లదే ఆధిపత్యం కనిపిస్తుంది. టీ20ల్లో హాఫ్ సెంచరీలు, సెంచరీలు ఎంత తక్కువ బాల్స్‌లో చేస్తే ఆ క్రికెటర్లకు అంత క్రేజ్, ఫేమ్ వస్తుంది.
జిడ్డు బ్యాటింగ్...
సాధారణంగా టీ20ల్లో హాఫ్ సెంచరీలను ఇరవై ఐదు నుంచి ముప్పై బాల్స్‌లోపే చేస్తుంటారు. అంతకంటే ఎక్కువ బాల్స్ ఆడితే జిడ్డు బ్యాటింగ్ అంటూ అభిమానులు విమర్శలు గుప్పిస్తారు.
కానీ ప్రస్తుతం టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం ఓ ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడానికి ఏకంగా 54 బాల్స్ తీసుకున్నాడు. టీమిండియా తరఫున టీ20ల్లో స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన క్రికెటర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అయితే గంభీర్ జిడ్డు బ్యాటింగ్ చేసినా ఆ మ్యాచ్‌లో టీమిండియా గెలవడం గమనార్హం.
ఆస్ట్రేలియా 131 రన్స్...
2012లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్స్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో గంభీర్ స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఇరవై ఓవర్లలో 131 పరుగులు మాత్రమే చేసింది.వినయ్ కుమార్, రాహుల్ శర్మతో పాటు మిగిలిన భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా తక్కువ స్కోరుకే పరిమితమైంది.
54 బాల్స్‌లో హాఫ్ సెంచరీ...
ఈ సింపుల్ టార్గెట్‌ను టీమిండియా చివరి ఓవర్‌కు ఛేజ్ చేసింది. ఈ మ్యాచ్‌లో జిడ్డు బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా బౌలర్ల ఓపికకు పరీక్ష పెట్టాడు గంభీర్. 54 బాల్స్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. అతడి హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌లో కేవలంమూడు ఫోర్లు మాత్రమే ఉండటం గమనార్హం. మొత్తంగా ఈ మ్యాచ్‌లో గంటన్నర పాటు క్రీజులో ఉన్న గంభీర్ 60 బాల్స్‌లో నాలుగు ఫోర్లతో 56 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
షోయబ్ మాలిక్ కూడా...
టీ20 ఫార్మెట్‌లో స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన సెకండ్ క్రికెటర్‌గా గంభీర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. గంభీర్ కంటే ముందు స్కాట్లాండ్ బ్యాటర్ రయాన్ వాట్సన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. అతడు కూడా యాభై నాలుగు బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఈ లిస్ట్‌లో షోయబ్ మాలిక్ (యాభై మూడు బాల్స్‌లో హాఫ్ సెంచరీ) మూడో ప్లేస్‌లో ఉండగా....శ్రీలంక క్రికెటర్ మాథ్యూస్ (50 బాల్స్‌లో ) నాలుగో స్థానంలో కొనసాగుతోన్నాడు.
హెడ్ కోచ్...
టీమిండియాకు హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఇటీవలే నియమితుడయ్యాడు. టీ20 వరల్డ్ కప్‌తో రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియడంతో అతడి స్థానంలో గంభీర్‌ను బీసీసీఐ హెడ్ కోచ్‌గా సెలెక్ట్ చేసింది. రెండేళ్ల పాటు గంభీర్ ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గంభీర్ కోచ్‌గా ఉన్నాడు. టీమిండియా బాధ్యతలు చేపట్టడంతో కోల్‌కతా టీమ్‌కు కోచ్ బాధ్యతల నుంచి గంభీర్ తప్పుకున్నట్లు సమాచారం.