Shikhar Dhawan - Pujara: యంగ్‌స్ట‌ర్స్‌ను ఆడ‌నివ్వు - పుజారాకు కౌంట‌ర్ ఇచ్చిన ధావ‌న్‌-shikhar dhawan funny comments on pujara irani trophy preparations ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Shikhar Dhawan Funny Comments On Pujara Irani Trophy Preparations

Shikhar Dhawan - Pujara: యంగ్‌స్ట‌ర్స్‌ను ఆడ‌నివ్వు - పుజారాకు కౌంట‌ర్ ఇచ్చిన ధావ‌న్‌

Nelki Naresh Kumar HT Telugu
Sep 28, 2023 09:59 AM IST

Shikar Dhawan - Pujara: కౌంటీ క్రికెట్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించిన టెస్ట్ స్పెష‌లిస్ట్ పుజారా ప్ర‌స్తుతం ఇరానీ ట్రోఫీ కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతోన్న‌ట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. అత‌డికి శిఖ‌ర్ ధావ‌న్ ఫ‌న్నీ కౌంట‌ర్ ఇచ్చాడు.

 పూజారా
పూజారా

Shikar Dhawan - Pujara: ఫామ్‌లేమితో పాటు యంగ్‌స్ట‌ర్స్‌ పోటీ కార‌ణంగా జాతీయ జ‌ట్టుకు దూర‌మ‌య్యారు వెట‌ర‌న్ ప్లేయ‌ర్స్ ఛటేశ్వర్ పుజారా, శిఖర్ ధావ‌న్‌. టీమిండియాకు దూరమైన టెస్ట్ స్పెష‌లిస్ట్ పుజారా కౌంటీ క్రికెట్‌లో అద‌గొట్టాడు. ఈ సీజ‌న్‌లో వ‌రుస సెంచ‌రీల‌తో ప‌రుగుల వ‌ర‌ద పారించాడు.

ట్రెండింగ్ వార్తలు

పుజారా కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన స‌సెక్స్ టీమ్ కౌంటీ ఛాంపియ‌న్‌షిప్ విజేత‌గా నిలిచింది. కౌంటీ సీజ‌న్‌ను ముగించుకొని ఇండియా వ‌చ్చిన పుజారా ఇరానీ ట్రోఫీ కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతోన్నాడు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఇరానీ ట్రోఫీ కోసం తిరిగి గ్రౌండ్‌లో అడుగుపెట్ట‌డం ఆనందంగా ఉందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. అత‌డికి శిఖ ధావ‌న్ ఫ‌న్నీగా కౌంట‌ర్ ఇచ్చాడు.

ఇరానీ ట్రోఫీ నీకు చాలా పాత‌దైపోయింద‌ని, యంగ్‌స్ట‌ర్స్‌కు ఆడే అవ‌కాశం ఇవ్వు అంటూ పుజారా పోస్ట్‌పై ఫన్నీగా కామెంట్ చేశాడు ధావన్. అతడి ఫన్నీ కామెంట్ వైర‌ల్‌గా మారింది. చివ‌ర‌గా టీమిండియా త‌ర‌ఫున పుజారా ఆస్ట్రేలియాతో జ‌రిగిన వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్‌ లో ఆడాడు. కీల‌క‌మైన ఈ టోర్నీలో దారుణంగా విఫ‌లం కావ‌డంతో అత‌డిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లొచ్చాయి.

పుజారాను జ‌ట్టు నుంచి త‌ప్పించారు. ధావ‌న్ కూడా టీమిండియా దూర‌మై చాలా కాల‌మ‌వుతోంది. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో బంగ్లాదేశ్‌పై చివ‌రి వ‌న్డే మ్యాచ్ ఆడాడు ధావ‌న్ 2021లో చివ‌రి టీ20 మ్యాచ్ ఆడాడు.

IPL_Entry_Point