India World Cup Team: వరల్డ్ కప్ టీమ్‌లో నలుగురు ముంబై ఇండియన్స్ ప్లేయర్స్.. ఆ మూడు టీమ్స్ నుంచి ఒక్కరూ లేరు-india world cup team have 4 mumbai indians players ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India World Cup Team: వరల్డ్ కప్ టీమ్‌లో నలుగురు ముంబై ఇండియన్స్ ప్లేయర్స్.. ఆ మూడు టీమ్స్ నుంచి ఒక్కరూ లేరు

India World Cup Team: వరల్డ్ కప్ టీమ్‌లో నలుగురు ముంబై ఇండియన్స్ ప్లేయర్స్.. ఆ మూడు టీమ్స్ నుంచి ఒక్కరూ లేరు

Hari Prasad S HT Telugu
Sep 05, 2023 08:39 PM IST

India World Cup Team: వరల్డ్ కప్ టీమ్‌లో నలుగురు ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ చోటు దక్కించుకోవడం విశేషం. ఇక ఐపీఎల్ కు చెందిన ఆ మూడు టీమ్స్ నుంచి ఒక్క ప్లేయర్ కూడా లేడు.

వరల్డ్ కప్ కోసం ఎంపికైన టీమిండియా
వరల్డ్ కప్ కోసం ఎంపికైన టీమిండియా (ANI )

India World Cup Team: వరల్డ్ కప్ 2023 కోసం మంగళవారం (సెప్టెంబర్ 5) ఇండియన్ టీమ్ ను సెలక్టర్లు ఎంపిక చేసిన విషయం తెలుసు కదా. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ఏకంగా నలుగురు ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ ఉండటం విశేషం. ఇక ఐపీఎల్లోని మూడు టీమ్స్ కు చెందిన ప్లేయర్స్ ఎవరూ ఈ జట్టులో లేరు.

yearly horoscope entry point

కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు ఇషాన్ కిషన్, బుమ్రా, సూర్యకుమార్ వరల్డ్ కప్ టీమ్ లో ఉన్నారు. వీళ్లంతా ముంబై ఇండియన్స్ కు ఆడుతున్న వాళ్లే. ఇక గుజరాత్ టైటన్స్ నుంచి ముగ్గురు, కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి ఇద్దరు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి ఇద్దరు, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఇద్దరు ప్లేయర్స్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ నుంచి చెరొకరు ఉన్నారు.

ఇక సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ నుంచి ఒక్కరు కూడా వరల్డ్ కప్ టీమ్ లో లేరు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, బుమ్రాలాంటి వాళ్లు గాయాల నుంచి కోలుకొని మళ్లీ వరల్డ్ కప్ టీమ్ లోకి వచ్చారు.

వరల్డ్ కప్ టీమ్‌లో ఐపీఎల్ టీమ్స్ ప్రాతినిధ్యం ఇలా..

ముంబై ఇండియన్స్ - రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్

గుజరాత్ టైటన్స్ - శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమి

కోల్‌కతా నైట్ రైడర్స్ - శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - విరాట్ కోహ్లి, మహ్మద్ సిరాజ్

ఢిల్లీ క్యాపిటల్స్ - అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్

లక్నో సూపర్ జెయింట్స్ - కేఎల్ రాహుల్

చెన్నై సూపర్ కింగ్స్ - రవీంద్ర జడేజా

వరల్డ్ కప్ కోసం 15 మందితో టీమ్ ఎంపిక చేసినా.. రిజర్వ్ ప్లేయర్స్, స్టాండ్ బైలను మాత్రం ఎంపిక చేయలేదు. నిజానికి ఈ జట్టులో సెప్టెంబర్ 28 వరకు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంది. సంజూ శాంసన్, చహల్, భువనేశ్వర్, శిఖర్ ధావన్ లాంటి ప్లేయర్స్ మిస్ కావడంపై కొందరు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Whats_app_banner