Team Bharat: టీమిండియా కాదు.. టీమ్ భారత్: వరల్డ్ కప్ టీమ్‌పై సెహ్వాగ్ ట్వీట్ వైరల్-team bharat not team india sehwag tweet gone viral after world cup team announcement ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team Bharat: టీమిండియా కాదు.. టీమ్ భారత్: వరల్డ్ కప్ టీమ్‌పై సెహ్వాగ్ ట్వీట్ వైరల్

Team Bharat: టీమిండియా కాదు.. టీమ్ భారత్: వరల్డ్ కప్ టీమ్‌పై సెహ్వాగ్ ట్వీట్ వైరల్

Hari Prasad S HT Telugu
Sep 05, 2023 02:44 PM IST

Team Bharat: టీమిండియా కాదు.. టీమ్ భారత్ అంటూ వరల్డ్ కప్ టీమ్‌పై సెహ్వాగ్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇండియా పేరును భారత్ గా మారుస్తారన్న ప్రచారం నేపథ్యంలో అతడు ఈ ట్వీట్ చేయడం విశేషం.

వీరేందర్ సెహ్వాగ్ (HT Photo)
వీరేందర్ సెహ్వాగ్ (HT Photo)

Team Bharat: వరల్డ్ కప్ 2023 కోసం ఇండియన్ టీమ్ ను మంగళవారం (సెప్టెంబర్ 5) అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ టీమ్ ఎంపిక తర్వాత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియా ఎక్స్ (గతంలో ట్విటర్)లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇండియా పేరును భారత్ గా మారుస్తారన్న ప్రచారం నేపథ్యంలో టీమిండియా కాదు టీమ్ భారత్ అనండి అంటూ వీరూ ఈ ట్వీట్ చేశాడు.

వరల్డ్ కప్ కోసం 15 మందితో కూడా టీమిండియాను సెలక్టర్లు ఎంపిక చేశారు. దీనిపై సెహ్వాగ్ స్పందిస్తూ.. "టీమిండియా కాదు టీమ్ భారత్. ఈ వరల్డ్ కప్ లో మనం కోహ్లి, రోహిత్, బుమ్రా, జడేజాలాంటి వాళ్లను చీర్ చేస్తున్నప్పుడు మన గుండెల్లో భారత్ ఉండాలి. అంతేకాదు ప్లేయర్స్ భారత్ పేరున్న జెర్సీల వేసుకోవాలి" అంటూ బీసీసీఐ సెక్రటరీ జై షాను వీరూ ట్యాగ్ చేశాడు.

ఇక మరో పోస్ట్ లో బ్రిటీష్ వాళ్లు ఇండియా పేరు ఇచ్చారని, మనం ఎప్పుడూ భారతీయులమే అని సెహ్వాగ్ అనడం విశేషం. "మనం గర్వపడే పేరు ఉండాలని నేను ఎప్పుడూ భావిస్తుంటాను. మనం భారతీయులం. ఇండియా అనే పేరును బ్రిటీష్ వాళ్లు ఇచ్చారు. చాలా కాలంగా ఈ పేరును మార్చి మళ్లీ మన భారత్ పేరును మార్చాల్సి ఉంది. వరల్డ్ కప్ లో మన ప్లేయర్స్ గుండెలపై భారత్ పేరున్న జెర్సీలు ధరించేలా చూడాలని నేను బీసీసీఐ,జై షాలను కోరుతున్నాను" అని సెహ్వాగ్ మరో పోస్ట్ లో అన్నాడు.

ఇండియా పేరును భారత్ గా మార్చడానికి పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం కాబోతోందన్న వార్తల నేపథ్యంలో సెహ్వాగ్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. మరోవైపు వరల్డ్ కప్ కోసం 15 మంది సభ్యుల జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. కేఎల్ రాహుల్ కు ఈ టీమ్ లో చోటు దక్కగా.. సంజూ శాంసన్, చహల్, అశ్విన్ లాంటి వాళ్లను సెలక్టర్లు పక్కన పెట్టారు. ఇక యంగ్ హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మకు కూడా అవకాశం దక్కలేదు.

IPL_Entry_Point