IND vs BAN 2nd Test Updates: అతి జాగ్రత్తగా ఆడుతున్న బంగ్లాదేశ్.. 24 బంతులాడి డకౌటైన ఓపెనర్-india vs bangladesh 2nd test day 1 updates akash deep strikes again dismisses shadman islam ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Ban 2nd Test Updates: అతి జాగ్రత్తగా ఆడుతున్న బంగ్లాదేశ్.. 24 బంతులాడి డకౌటైన ఓపెనర్

IND vs BAN 2nd Test Updates: అతి జాగ్రత్తగా ఆడుతున్న బంగ్లాదేశ్.. 24 బంతులాడి డకౌటైన ఓపెనర్

Galeti Rajendra HT Telugu
Sep 27, 2024 12:27 PM IST

Akash Deep: కాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్ ఓపెనర్లని నిమిషాల వ్యవధిలోనే టీమిండియా యంగ్ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ పెవిలియన్‌కి పంపాడు. అతనికి దెబ్బకి 24 బంతులాడినా.. కనీసం ఖాతా కూడా బంగ్లా ఓపెనర్ తెరవలేపోయాడు.

ఇస్లాం వికెట్ పడిన ఆనందంలో టీమిండియా
ఇస్లాం వికెట్ పడిన ఆనందంలో టీమిండియా (AP)

IND vs BAN 2nd Test Updates: బంగ్లాదేశ్‌తో కాన్పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ బౌలర్లు క్రమశిక్షణతో బంతులేస్తున్నారు. ఈరోజు ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ టీమ్ 20 ఓవర్లు ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ 61/2తో నిలిచింది. క్రీజులో మెమినుల్ హక్ (10 బ్యాటింగ్: 36 బంతుల్లో 2x4), కెప్టెన్ శాంటో (22 బ్యాటింగ్: 24 బంతుల్లో 5x4) ఉన్నారు.

24 బంతులాడి.. జీరోకే ఔట్

ఈరోజు తొలి సెషన్‌లోనే బంగ్లాదేశ్ టీమ్ ఓపెనర్లని టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ పెవిలియన్ బాట పట్టించాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో ఆకాశ్ దీప్ విసిరిన బంతిని అంచనా వేయలేకపోయినా ఓపెనర్ జాకీర్ హసన్ (0: 24 బంతుల్లో) సింపుల్‌గా యశస్వి జైశ్వాల్‌కి క్యాచ్ ఇచ్చి ఔటైపోయాడు. దాదాపు అరగంటకిపైగా క్రీజులో ఉన్నా.. జాకీర్ కనీసం ఖాతా కూడా తెరవలేకపోవడం గమనార్హం.

మరో ఓపెనర్ షదామన్ ఇస్లాం (24: 36 బంతుల్లో 4x4) నాలుగు బౌండరీలు కొట్టి మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించినా.. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లోనే వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. అయితే.. ప్రస్తుతం క్రీజులో ఉన్న కెప్టెన్ శాంటో మాత్రం సింగిల్స్ కంటే బౌండరీలే ఎక్కువగా కొడుతూ భారత్ బౌలర్లకి సవాల్ విసురుతున్నాడు.

జడేజాతో బౌలింగ్ చేయించని రోహిత్

జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో అతి జాగ్రత్తగా ఆడుతున్న బంగ్లాదేశ్ బ్యాటర్లు.. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో మాత్రం అటాక్ చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 8 పరుగులే ఇవ్వగా.. 6 ఓవర్లు వేసిన సిరాజ్ 22 రన్స్ ఇచ్చాడు. మరోవైపు అశ్విన్‌తో బౌలింగ్ చేయిస్తున్న రోహిత్ శర్మ.. రవీంద్ర జడేజాతో మాత్రం ఇప్పటి వరకు బౌలింగ్ చేయించలేదు.

వాస్తవానికి బంగ్లాదేశ్ టీమ్‌లో ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నది శాంటో మాత్రమే. చెపాక్ టెస్టులో టీమ్‌లోని బ్యాటర్లు విఫలమైన వేళ శాంటో హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. ఈరోజు కాన్పూర్ టెస్టులో శాంటో ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లోనే ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయిపోయినట్లు కనిపించాడు. కానీ.. అంపైర్ ఔట్ ఇవ్వలేదు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ డీఆర్‌ఎస్‌కి వెళ్లినా నిరాశ తప్పలేదు. వికెట్ చేజారుతుందనే భయం లేకుండా శాంటో క్రీజు వెలుపలికి వచ్చి మరీ షాట్స్ ఆడుతున్నాడు.