ICC Rankings: రోహిత్‍ను వెనక్కి నెట్టిన జైస్వాల్, పంత్.. టాప్-10 నుంచి కోహ్లీ ఔట్.. రెండో ర్యాంకుకు బుమ్రా-icc latest test rankings yashasvi jaiswal crosses rohit sharma and rishabh pant grand re entry japsrit bumrah climbs ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Icc Rankings: రోహిత్‍ను వెనక్కి నెట్టిన జైస్వాల్, పంత్.. టాప్-10 నుంచి కోహ్లీ ఔట్.. రెండో ర్యాంకుకు బుమ్రా

ICC Rankings: రోహిత్‍ను వెనక్కి నెట్టిన జైస్వాల్, పంత్.. టాప్-10 నుంచి కోహ్లీ ఔట్.. రెండో ర్యాంకుకు బుమ్రా

Sep 25, 2024, 06:21 PM IST Chatakonda Krishna Prakash
Sep 25, 2024, 02:33 PM , IST

  • ICC Test Rankings: ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో యశస్వి జైస్వాల్ అదగొట్టాడు. భారత్ తరఫున బెస్ట్ ర్యాంకర్‌ అయ్యాడు. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ర్యాంకులు పడిపోయాయి. రిషబ్ పంత్ ర్యాంకింగ్‍ల్లో గ్రాండ్‍గా రీఎంట్రీ ఇచ్చాడు.

ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్ నేడు (సెప్టెంబర్ 25) వచ్చేశాయి. బంగ్లాదేశ్‍తో తొలి టెస్టులో విఫలమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ర్యాంకుల్లో కిందికి వెళ్లారు. ఈ టెస్టులో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ ర్యాంకు మెరుగుపడింది. 

(1 / 6)

ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్ నేడు (సెప్టెంబర్ 25) వచ్చేశాయి. బంగ్లాదేశ్‍తో తొలి టెస్టులో విఫలమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ర్యాంకుల్లో కిందికి వెళ్లారు. ఈ టెస్టులో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ ర్యాంకు మెరుగుపడింది. (PTI)

బంగ్లాదేశ్‍తో తొలి టెస్టులో అర్ధ శతకంతో అదరగొట్టిన భారత యంగ్ స్టార్ యశస్వి జైస్వాల్ ఓ స్థానం మెరుగుపరుచుకొని ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో ఐదో స్థానానికి చేరాడు. ఐదో ర్యాంకు నుంచి పదో ప్లేస్‍కు పడిపోయాడు రోహిత్ శర్మ. దీంతో భారత్ తరఫున అత్యుత్తమ ర్యాంకర్‌గా జైస్వాల్ ఉన్నాడు. 

(2 / 6)

బంగ్లాదేశ్‍తో తొలి టెస్టులో అర్ధ శతకంతో అదరగొట్టిన భారత యంగ్ స్టార్ యశస్వి జైస్వాల్ ఓ స్థానం మెరుగుపరుచుకొని ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో ఐదో స్థానానికి చేరాడు. ఐదో ర్యాంకు నుంచి పదో ప్లేస్‍కు పడిపోయాడు రోహిత్ శర్మ. దీంతో భారత్ తరఫున అత్యుత్తమ ర్యాంకర్‌గా జైస్వాల్ ఉన్నాడు. (PTI)

బంగ్లాదేశ్‍తో మ్యాచ్‍తో 21 నెలల తర్వాత టెస్టు క్రికెట్‍లోకి రీఎంట్రీ ఇచ్చాడు భారత్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్. బంగ్లాతో మ్యాచ్‍లో సెంచరీతో కదంతొక్కాడు. దీంతో ఏకంగా ఆరో ర్యాంకుకు వచ్చేశాడు. జైస్వాల్, పంత్ ర్యాంకుల్లో దూసుకెళ్లడంతో రోహిత్, కోహ్లీ కిందికి వెళ్లిపోయారు. 

(3 / 6)

బంగ్లాదేశ్‍తో మ్యాచ్‍తో 21 నెలల తర్వాత టెస్టు క్రికెట్‍లోకి రీఎంట్రీ ఇచ్చాడు భారత్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్. బంగ్లాతో మ్యాచ్‍లో సెంచరీతో కదంతొక్కాడు. దీంతో ఏకంగా ఆరో ర్యాంకుకు వచ్చేశాడు. జైస్వాల్, పంత్ ర్యాంకుల్లో దూసుకెళ్లడంతో రోహిత్, కోహ్లీ కిందికి వెళ్లిపోయారు. (PTI)

భారత స్టార్ విరాట్ కోహ్లీ ఏకంగా ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో టాప్-10 నుంచి ఔట్ అయ్యాడు. ఐదు స్థానాలు కోల్పోయి 12వ ర్యాంకుకు పడిపోయాడు. బంగ్లాతో తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఫెయిల్ అయ్యాడు. 

(4 / 6)

భారత స్టార్ విరాట్ కోహ్లీ ఏకంగా ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకుల్లో టాప్-10 నుంచి ఔట్ అయ్యాడు. ఐదు స్థానాలు కోల్పోయి 12వ ర్యాంకుకు పడిపోయాడు. బంగ్లాతో తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ ఫెయిల్ అయ్యాడు. (PTI)

టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్‍ల్లో ఇంగ్లండ్ సీనియర్ జో రూట్ టాప్‍లో ఉండగా.. న్యూజిలాండ్ ప్లేయర్లు కేన్ విలియమ్స్, డారిల్ మిచెల్ రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్నారు. నాలుగో ప్లేస్‍లో ఆసీస్ స్టార్ స్మిత్ ఉండగా.. ఐదు, ఆరు ర్యాంకులకు జైస్వాల్, పంత్ చేరారు.

(5 / 6)

టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్‍ల్లో ఇంగ్లండ్ సీనియర్ జో రూట్ టాప్‍లో ఉండగా.. న్యూజిలాండ్ ప్లేయర్లు కేన్ విలియమ్స్, డారిల్ మిచెల్ రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్నారు. నాలుగో ప్లేస్‍లో ఆసీస్ స్టార్ స్మిత్ ఉండగా.. ఐదు, ఆరు ర్యాంకులకు జైస్వాల్, పంత్ చేరారు.(AFP)

ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకుల్లో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫస్ట్ ర్యాంకును పదిలం చేసుకున్నాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా రెండో ర్యాంకుకు వచ్చాడు. ఆసీస్ పేసర్ జోస్ హాజిల్‍వుడ్ మూడో ర్యాంకుకు పడిపోయాడు. టెస్టు ఆల్‍రౌండర్ ర్యాంకింగ్‍ల్లో జడేజా, అశ్విన్ తొలి రెండు ర్యాంకుల్లో కంటిన్యూ అయ్యారు. టెస్టు టీమ్ ర్యాంకింగ్‍ల్లో భారత్ రెండో ప్లేస్‍లో కొనసాగింది.

(6 / 6)

ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకుల్లో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫస్ట్ ర్యాంకును పదిలం చేసుకున్నాడు. టీమిండియా స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా రెండో ర్యాంకుకు వచ్చాడు. ఆసీస్ పేసర్ జోస్ హాజిల్‍వుడ్ మూడో ర్యాంకుకు పడిపోయాడు. టెస్టు ఆల్‍రౌండర్ ర్యాంకింగ్‍ల్లో జడేజా, అశ్విన్ తొలి రెండు ర్యాంకుల్లో కంటిన్యూ అయ్యారు. టెస్టు టీమ్ ర్యాంకింగ్‍ల్లో భారత్ రెండో ప్లేస్‍లో కొనసాగింది.(AFP)

ఇతర గ్యాలరీలు