Hardik Pandya Injury: టీమిండియాకు బ్యాడ్‍న్యూస్.. న్యూజిలాండ్‍తో మ్యాచ్‍కు హార్దిక్ దూరం.. ఆ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్!
Hardik Pandya Injury: న్యూజిలాండ్‍తో మ్యాచ్‍కు హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. ఈ విషయంపై బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
Hardik Pandya Injury: వన్డే ప్రపంచకప్‍లో భారత జట్టు ఫుల్ జోష్‍లో ఉంది. అద్భుతమైన ఆట తీరుతో తొలి నాలుగు మ్యాచ్‍ల్లో విజయం సాధించింది. ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‍లతో భారీ విజయాలతో సత్తాచాటింది భారత్. ఐదో మ్యాచ్‍లో న్యూజిలాండ్‍తో టీమిండియా తలపడనుంది. ధర్మశాల వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం (అక్టోబర్ 22) మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్‍కు ముందు భారత్‍కు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‍కు దూరమయ్యాడు.
బంగ్లాదేశ్‍తో మ్యాచ్‍లో తన తొలి ఓవర్లోనే హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. కాలితో బంతిని ఆపే క్రమంలో అతడి కాలి చీలమండ (Ankle)కు గాయమైంది. దీంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి కాలికి స్కానింగ్ చేయించింది టీమిండియా మేనేజ్‍మెంట్. పాండ్యాకు అయిన గాయం అంత పెద్దది కాదని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. అయితే, ఈ గాయం నుంచి కోలుకునేందుకు కొన్ని ఇంజెక్షన్లను పాండ్యా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే న్యూజిలాండ్‍తో మ్యాచ్‍కు పాండ్యా దూరమయ్యాడు.
“ధర్మశాల విమానాన్ని అతడు (హార్దిక్ పాండ్యా) ఎక్కడం లేదు. ఇంగ్లండ్‍తో మ్యాచ్ కోసం టీమిండియా అతడు కలుస్తాడు” అని బీసీసీఐ వెల్లడించింది. అంటే న్యూజిలాండ్‍తో మ్యాచ్‍కు పాండ్యా దూరమైనా.. ఇంగ్లండ్‍తో పోరుకు అందుబాటులోకి వస్తాడని స్పష్టం చేసింది.
హార్దిక్ పాండ్యా ఇప్పుడు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడు. ప్రత్యేకమైన ఫిజిషియన్ పర్యవేక్షణలో అతడికి చికిత్స జరుగుతుంది. ఇందులో భాగంగా అతడికి ఇంజెక్షన్లు ఇవ్వనున్నారు వైద్యులు.
ఇద్దరిలో ఛాన్స్ ఎవరికి..
హార్దిక్ పాండ్య లేకపోవటంతో అతడికి సరిగ్గా సరిపోయే ఫాస్ట్ బౌలింగ్ ఆల్‍రౌండర్ బ్యాకప్ లేదు. దీంతో హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమీలో ఒకరికి న్యూజిలాండ్‍తో మ్యాచ్‍లో తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ ధర్మశాల పిచ్ పేస్‍కు ఎక్కువగా అనుకూలించేలా ఉంటే మరో ఆలోచన కూడా చేస్తోంది టీమిండియా మేనేజ్మెంట్. అలా అయితే, శార్దూల్ ఠాకూర్‌ను కూడా తుది జట్టు నుంచి తప్పించి సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమీ ఇద్దరినీ తీసుకోవాలనే ఆలోచన కూడా ఉంది. మ్యాచ్ రోజు నాటి పరిస్థితులను చూసి నిర్ణయం తీసుకోవాలని టీమిండియా మేనేజ్‍మెంట్ ఆలోచిస్తోంది.