IND vs PAK Asia Cup Promo: ఆసియా కప్ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ప్రోమో రిలీజ్ - గూస్ బంప్స్ ఖాయం!
IND vs PAK Asia Cup Promo: ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 2న జరుగనుంది. ఈ మ్యాచ్ తాలూకు ప్రోమోను స్టార్ స్పోర్ట్స్ ఆదివారం రిలీజ్ చేసింది.
IND vs PAK Asia Cup Promo: ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థులు ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 2న జరుగనుంది. శ్రీలంకలోని పల్లకెలే స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇండియా పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌కు మరో ఆరు రోజులు సమయం ఉండగానే ఇప్పటినుంచే ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ మొదలైంది. ఆదివారం ఈ మ్యాచ్ తాలూకు ప్రోమోను స్టార్ స్పోర్ట్స్ రిలీజ్ చేసింది. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ప్రోమో ఆరంభంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాంతో పాటు విరాట్ కోహ్లి కనిపిస్తోన్నారు. ఆ తర్వాత పాకిస్థాన్ ప్లేయర్స్‌తో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ మాటల యుద్ధాన్ని చూపించారు. కోహ్లి అగ్రెసివ్ సెలబ్రేషన్స్ ఈ ప్రోమోకు హైలైట్‌గా నిలిచాయి. ఈ ప్రోమో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఆగస్ట్ 30 నుంచి ఆసియా కప్ మొదలుకానుంది. సెప్టెంబర్ 17న ఫైనల్ జరుగనుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో పసికూన నేపాల్ తలపడనుంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌తోనే ఆసియా కప్ సమరాన్ని ఇండియా మొదలుపెట్టబోతున్నది. ఆసియా కప్‌కు పాకిస్థాన్‌తో పాటు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
భద్రతా పరమైన కారణాల వల్ల ఇండియా మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. రోహిత్ శర్మ సారథ్యంలో మొత్తం 17 మంది సభ్యులతో కూడిన టీమ్ ఇండియా జట్టును ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, ఆప్ఘనిస్థాన్, నేపాల్ తలపడనున్నాయి.