Stocks to buy : 5ఏళ్లల్లో రూ. 1లక్షను రూ. 35లక్షలు చేసిన స్టాక్​- ఇప్పుడు కొనొచ్చా?-zen technologies share price gives 3380 percent returns in 5 years buy or sell ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy : 5ఏళ్లల్లో రూ. 1లక్షను రూ. 35లక్షలు చేసిన స్టాక్​- ఇప్పుడు కొనొచ్చా?

Stocks to buy : 5ఏళ్లల్లో రూ. 1లక్షను రూ. 35లక్షలు చేసిన స్టాక్​- ఇప్పుడు కొనొచ్చా?

Sharath Chitturi HT Telugu
Aug 27, 2024 12:15 PM IST

Multibaggar stock alert : మల్టీబ్యాగర్​ స్టాక్​ అలర్ట్​! ఈ సంస్థ షేరు 5ఏళ్లల్లో 3,300 శాతం కన్నా ఎక్కువ పెరిగి, రూ. 1లక్షను రూ. 35లక్షలుగా మార్చింది. ఎందుకు? కారణాలేంటి?

ఈ స్టాక్​.. 5ఏళ్లల్లో 3,300 శాతం కన్నా ఎక్కువ పెరిగింది!
ఈ స్టాక్​.. 5ఏళ్లల్లో 3,300 శాతం కన్నా ఎక్కువ పెరిగింది!

స్టాక్​ మార్కెట్​లో మల్టీబ్యాగర్​ స్టాక్స్​కి మంచి డిమాండ్​ ఉంటుంది. తక్కువ కాలంలోనే ఎక్కువ రిటర్నులు ఇచ్చే ఈ స్టాక్స్​ కోసం ఇన్​వెస్టర్స్​ తెగ వెతుకుతూ ఉంటారు. ఇలాంటిదే జెన్​ టెక్నాలజీస్​ స్టాక్​. ఈ సంస్థ షేరు 5ఏళ్లల్లో ఏకంగా 3,380శాతం పెరిగింది. రూ. 1లక్ష పెట్టుబడిని రూ. 35లక్షలుగా మార్చి పెట్టుబడిదారులకు సంతోషాన్ని ఇచ్చింది.

జెన్​ టెక్నాలజీస్​ షేర్​ ప్రైజ్​..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో జెన్​ టెక్నాలజీస్​ షేరు ధర రూ. 1970 వద్ద ఆల్​టైమ్​ హైని, ఇంట్రాడే హైని తాకింది. ఉదయం 11:30 సమయానికి రూ. 1881 వద్ద ట్రేడ్​ అవుతోంది. 5ఏళ్ల ముందు ఈ స్టాక్​ కేవలం రూ. 56గా ఉండటం విశేషం. అంటే 5ఏళ్లల్లో 3,380 కన్నా ఎక్కువ శాతం రిటర్నులు ఇచ్చింది.

యాంటీ డ్రోన్ తయారీ సంస్థ జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్ షేరు నేడు రూ.1900.90 వద్ద ప్రారంభమై రూ.1970 వద్ద ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. జూన్ నుంచి ఈ స్టాక్ 115 శాతం కన్నా పైగా పెరిగింది.

ఒక్కో షేరుకు రూ.1,601 ఇష్యూ ధరతో 6.25 మిలియన్ ఈక్విటీ షేర్లను క్యూఐపీకి కేటాయించినట్లు జెన్ టెక్నాలజీస్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్​లో తెలిపింది. జెన్ టెక్నాలజీస్ క్యూఐపీని 2024 ఆగస్టు 21న ప్రారంభించి 2024 ఆగస్టు 23న మూసివేసింది. దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల మధ్య పోటీ నెలకొనడంతో ఇష్యూ దాదాపు 5 సార్లు ఓవర్ సబ్​స్క్రైబ్ అయింది. కోటాక్ మ్యూచువల్ ఫండ్, వైట్ ఓక్ ఆఫ్షోర్ ఫండ్, వైట్ ఓక్ మ్యూచువల్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్, బంధన్ మ్యూచువల్ ఫండ్ ఈ క్యూఐపీలో పాల్గొన్న ప్రధాన ఇన్వెస్టర్లు.

జెన్​ టెక్నాలజీస్ ప్రాడక్ట్స్​ భారత ప్రభుత్వ 'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్​'లకు అనుగుణంగా దేశీయంగా తయారవుతాయి. అభివృద్ధి చేస్తాయి. డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్​లో స్వావలంబనను ప్రోత్సహించడం దీని ఉద్దేశం. కంపెనీ పోర్ట్ ఫోలియోలో ట్యాంకులు, డ్రైవింగ్, ఫ్లైట్ సిమ్యులేటర్లు వంటి విస్తృత శ్రేణి ప్రాడక్ట్స్​ ఉన్నాయి. వీటితో పాటు శత్రు డ్రోన్లను గుర్తించడానికి, ట్రాక్ చేయడానికి, ధ్వంసం చేయడానికి రూపొందించిన యాంటీ డ్రోన్ వ్యవస్థలు సైతం ఉన్నాయి.

స్టాక్ ఇప్పుడు కొనచ్చా?​ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారంటే:

స్టాక్ మార్కెట్ నిపుణుడు సీఏ మనీష్ గార్గ్ జెనె టెక్నాలజీస్​ని లాంగ్ రేస్ హార్స్​గా అభివర్ణించారు. ""రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్, ఇజ్రాయెల్-లెబనాన్ యుద్ధాల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. యాంటీ డ్రోన్ టెక్నాలజీపై జెన్​ టెక్ పనిచేస్తోంది. అటువంటి పరిస్థితిలో, రాబోయే కాలంలో దీనికి డిమాండ్ పెరుగుతుంది. జెనెన్ టెక్​కు భారత రక్షణతో పాటు ఇతర దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. అందుకే స్టాక్​ పెరుగుతోంది," అని అన్నారు.

కానీ ఈ స్టాక్​ ఇప్పటికే చాలా పెరిగిపోయిందని ఇన్​వెస్టర్లు గుర్తించాలి.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. ఏదైనా స్టాక్​లో ఇన్​వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం