Stocks to buy today : స్టాక్స్ టు బై.. ఈ రూ. 105 స్టాక్‌తో షార్ట్ టర్మ్ గెయిన్స్!
Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. ఇందులో బ్రేకౌట్ స్టాక్స్ కూడా ఉన్నాయి. ఆ వివరాలు..
Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లోగా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 612 పాయింట్లు పెరిగి 81,698 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 187 పాయింట్లు పెరిగి 25,011 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 215 పాయింట్లు పెరిగి 51,148 వద్దకు చేరింది.
"సెప్టెంబర్ సమావేశం నుంచి వడ్డీ రేట్ల కోతలు మొదలయ్యే అవకాశం ఉందని అమెరికా ఫెడ్ సంకేతాలు ఇవ్వడంతో భారత ఈక్విటీలు 25 వేల మార్కును తిరిగి పొందాయి. విస్తృత మార్కెట్ భాగస్వామ్యంతో కొనసాగుతున్న వేగం కొత్త గరిష్టాల దిశగా కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాము. ఈ వారం, మార్కెట్ భారతదేశం- యూఎస్ జీడీపీ డేటా, డెరివేటివ్స్ నెలవారీ గడువు- ఇతర ప్రపంచ సంకేతాలపై దృష్టి పెడుతుంది," అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అన్నారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 483.36 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1870.22 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 30102.4 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ. 48950.6 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాటగా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. డౌ జోన్స్ 0.16శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.32శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.48 శాతం పతనమైంది.
స్టాక్స్ టు బై..
సిప్లా లిమిటెడ్ (సిప్లా): రూ.1,593కు కొనండి. రూ.1,650 టార్గెట్ స్టాప్ లాస్ రూ.1,560
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (ఎం అండ్ ఎం): రూ.2,794 వద్ద కొనండి. టార్గెట్ రూ.2,850 స్టాప్ లాస్ రూ.2,740
వాలియంట్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (వాలియంట్టార్గ్): రూ.403కు కొనండి. రూ.420 టార్గెట్.. రూ.390 వద్ద స్టాప్ లాస్.
బ్రేకౌట్ స్టాక్స్..
ఎన్డీఆర్ ఆటో: రూ.1639 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1740, స్టాప్ లాస్ రూ.1572;
ప్రెసిషన్ వైర్స్: రూ.193.40 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.204, స్టాప్ లాస్ రూ.186
కామధేను: రూ.551.75 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.585, స్టాప్ లాస్ రూ.533
క్విక్ హీల్: రూ.700 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.737, స్టాప్ లాస్ రూ.677
ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్: రూ .106 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .111, స్టాప్ లాస్ రూ .102.
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం