New changes in WhatsApp: యూజర్లకు నచ్చని వాట్సాప్ లో వచ్చిన కొత్త అప్ డేట్; డైరెక్ట్ అటాక్..-why is your whatsapp app green now big changes rolled out one is just awesome ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Changes In Whatsapp: యూజర్లకు నచ్చని వాట్సాప్ లో వచ్చిన కొత్త అప్ డేట్; డైరెక్ట్ అటాక్..

New changes in WhatsApp: యూజర్లకు నచ్చని వాట్సాప్ లో వచ్చిన కొత్త అప్ డేట్; డైరెక్ట్ అటాక్..

HT Telugu Desk HT Telugu
Apr 26, 2024 02:21 PM IST

New changes in WhatsApp: యూజర్ల అవసరాలకు, సౌలభ్యాలకు అనుగుణంగా వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను, లేటెస్ట్ అప్ డేట్స్ ను తీసుకువస్తుంది. అందులో కొన్ని యూజ్ ఫుల్ గా ఉంటే, మరికొన్ని పెద్దగా ఉపయోగపడవు. అలాంటి ఒక కొత్త అప్ డేట్ పై యూజర్లు నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ లోగో రంగు మారింది..
వాట్సాప్ లోగో రంగు మారింది.. (REUTERS)

New changes in WhatsApp: వాట్సాప్ మరోసారి వార్తల్లో నిలిచింది. అందుకు ఒక కారణం భారత్ సహా వివిధ దేశాల్లోని కోర్టుల్లో జరుగుతున్న ప్రైవసీ ఇష్యూస్ కేసు కాగా, మరొకటి, వాట్సాప్ లో తరచూ వస్తున్న మార్పులు. సాధారణంగా వాట్సాప్ అప్ డేట్స్ యూజర్లకు ఉపయోగపడేలా ఉంటాయి. కానీ, తాజాగా వాట్సాప్ తీసుకువచ్చిన ఒక అప్ డేట్ యూజర్లకు పెద్దగా నచ్చడం లేదు. అది కొత్త వాట్సాప్ కలర్.

కొత్త వాట్సాప్ కలర్ నచ్చలే..

వాట్సాప్ లోగో కలర్ మారింది. ఇప్పుడు అది గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది. గతంలో ఇది బ్లూ కలర్ లో ఉండేది. ఈ మార్పు దశలవారీగా వినియోగదారులకు కనిపిస్తుంది. అందువల్ల ఒకవేళ ఇప్పుడు మీ వాట్సాప్ లోగో గ్రీన్ కలర్ లో కనిపించకపోతే, త్వరలోనే అది ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అయితే, ఈ అప్ డేట్ పై యూజర్లు నెగటివ్ గా స్పందిస్తున్నారు. ఆ మార్పు వల్ల తమకు ఎలాంటి ఉపయోగం లేదని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై కామెంట్స్ చేస్తున్నారు. వాట్సాప్ ఎందుకు ఇలాంటి పనులు చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఉన్న నీలిరంగు చాలా బావుండేదని, కొత్త ఆకుపచ్చ రంగులో ఈ యాప్ ను చూడడం అసహ్యంగా ఉందని కొందరు యూజర్లు కఠిన కామెంట్స్ చేస్తున్నారు. వాట్సాప్ ఆకుపచ్చ రంగుపై కొందరు ఘాటుగా స్పందిస్తుంటే, మరికొందరు కొంత సున్నితంగా వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు, ఒక యూజర్ ఎక్స్ లో "వాట్సాప్ ఎందుకు ఆకుపచ్చగా మారింది?" అని సున్నితంగా కామెంట్ చేయగా, బెన్ వైట్ వంటి ఇతరులు ‘ఈ మార్పు నాకు నచ్చలేదు’ అని బ్లంట్ గా కామెంట్ చేశారు.

డార్క్ మోడ్ లో మార్పు.. ట్యాబ్స్ ప్లేస్ లో మార్పు

వాట్సాప్ (WhatsApp) లో మరో మార్పు కూడా కనిపిస్తోంది. ఆండ్రాయిడ్ (Android) డివైజెస్ లో వాట్సాప్ డార్క్ మోడ్ మరింత ముదురు రంగులోకి మారింది. లైట్ మోడ్ లో పఠన సౌలభ్యం మరింత మెరుగుపడింది. అలాగే, ఐఓఎస్ (IOS) లోని కొన్ని బటన్లు, కొన్ని ఐకాన్లు మేకోవర్ అయ్యాయి. మెరుగైన యాక్సెస్ ను అందించడానికి వాటి మధ్య ఎక్కువ స్పేస్ ను ఏర్పాటు చేశారు. యూజర్లకు బాగా ఉపయోగపడే మరో మార్పును కూడా వాట్సాప్ చేసింది. అది గతంలో యాప్ పైభాగంలో కనిపించిన ట్యాబ్ లను స్క్రీన్ కింది భాగంలోకి మార్చారు. దీనివల్ల మీరు ఫోన్ ను పట్టుకునే విధానాన్ని మార్చాల్సిన అవసరం లేకుండా మీరు వాటిని క్షణాల్లో యాక్సెస్ చేయగలరు. అలాగే, వాట్సాప్ (WhatsApp) చాట్స్ ట్యాబ్ లో ఇప్పుడు వాట్సాప్ లోగో కూడా కనిపిస్తుంది.

WhatsApp channel