WhatsApp: ‘‘వాట్సాప్ వీడియో కాల్ లో ఇకపై 32 మంది పాల్గొనవచ్చు.. మరికొన్ని ఫీచర్స్ కూడా..’’-whatsapp video calls now support 32 participants screen sharing and speaker spotlight ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp: ‘‘వాట్సాప్ వీడియో కాల్ లో ఇకపై 32 మంది పాల్గొనవచ్చు.. మరికొన్ని ఫీచర్స్ కూడా..’’

WhatsApp: ‘‘వాట్సాప్ వీడియో కాల్ లో ఇకపై 32 మంది పాల్గొనవచ్చు.. మరికొన్ని ఫీచర్స్ కూడా..’’

HT Telugu Desk HT Telugu
Jun 14, 2024 07:54 PM IST

WhatsApp video calls: వాట్సాప్ తన వీడియో కాలింగ్ ఫీచర్లను అప్డేట్ చేసింది. ఆడియోతో స్క్రీన్ షేరింగ్, స్పీకర్ స్పాట్ లైట్ ఫీచర్ ను కూడా యాడ్ చేసింది. ఇకపై వాట్సాప్ వీడియో కాల్ లో ఇకపై గరిష్టంగా 32 మంది వరకు పాల్గొనవచ్చు.

వాట్సాప్ లేటెస్ట్ అప్ డేట్స్
వాట్సాప్ లేటెస్ట్ అప్ డేట్స్ (WhatsApp)

WhatsApp video calls: వాట్సాప్ తన వీడియో కాలింగ్ ఫీచర్లను అప్ డేట్ చేసింది. ఆడియో సపోర్ట్ తో స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ను, స్పీకర్ స్పాట్ లైట్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. వాట్సాప్ లో ఇప్పుడు వీడియో కాల్ లో 32 మంది వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది.

వీడియో కాల్స్ కోసం స్క్రీన్ షేరింగ్

వీడియో కాల్స్ కోసం స్క్రీన్ షేరింగ్ ను వాట్సాప్ (WhatsApp) గతంలోనే ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఆడియో సపోర్ట్ ను జోడించడం ద్వారా ఈ ఫీచర్ ను మరింత మెరుగుపరిచింది. దీని ద్వారా యూజర్లు కాల్ సమయంలో కలిసి వీడియోలను వీక్షించవచ్చు, స్క్రీన్ మరియు సౌండ్ రెండింటినీ వారి కాంటాక్ట్ లతో షేర్ చేసుకోవచ్చు.

వాట్సాప్ పార్టిసిపెంట్ లిమిట్

ఆడియోతో స్క్రీన్ షేరింగ్ అనేది వాట్సాప్ ప్రవేశ పెట్టిన కొత్త ఫీచర్లలో ప్రధానమైనది. వినియోగదారులు ఇప్పుడు వారి స్క్రీన్లపై వీడియోలను లేదా ఇతర కంటెంట్ ను ఆడియోతో భాగస్వామ్యం చేయవచ్చు. అలాగే, వీడియో కాల్ లో పాల్గొనేవారి సంఖ్యను పెంచడం మరో ముఖ్యమైన మార్పు. వాట్సాప్ ద్వారా ఇప్పుడు ఒకేసారి 32 మంది పాల్గొని వీడియో కాల్ చేసుకోవచ్చు. ఈ వీడియో కాల్ లో పాల్గొనేవారు డెస్క్ టాప్ లేదా మొబైల్ పరికరాన్ని ఉపయోగిస్తున్నారా అనే దానితో సంబంధం లేకుండా, ఏ డివైజ నుంచైనా ఈ వీడియో కాల్ లో పాల్గొనవచ్చు. ఈ అప్ డేట్ వర్చువల్ సమావేశాలు, ఆన్ లైన్ తరగతుల వంటి వాటికి ఉపయోగపడ్తుంది.

వాట్సాప్ స్పీకర్ స్పాట్ లైట్ ఫీచర్

గ్రూప్ కాల్స్ సమయంలో సంభాషణలను నిర్వహించడానికి స్పీకర్ స్పాట్ లైట్ ఫీచర్ సహాయపడుతుంది. దీనివల్ల మాట్లాడే వ్యక్తి ఆటోమేటిక్ గా హైలైట్ చేయబడతాడు. తెరపై అతడే మొదట కనిపిస్తాడు. దీనివల్ల చర్చల ప్రక్రియ సులభతరం అవుతుంది. ఆడియో, వీడియో క్వాలిటీని పెంచడంపై వాట్సాప్ దృష్టి సారించింది. ఎంలో కోడెక్ (MLow codec) ను ఇటీవల ప్రవేశపెట్టడం వల్ల కాల్ స్పష్టత మెరుగుపడింది. దీనివల్ల శబ్ద స్పష్టతతో పాటు ఎకో క్యాన్సిలేషన్ కు వీలవుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ బలంగా ఉంటే వీడియో కాల్స్ ను అధిక రిజల్యూషన్ లో చేసుకోవచ్చు.

Whats_app_banner