WhatsApp screen lock : వాట్సాప్​ 'స్క్రీన్​ లాక్' ఫీచర్​​.. ఇక ఛాట్స్​ మరింత భద్రం!-whatsapp may bring a screen lock feature for its desktop users ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp Screen Lock : వాట్సాప్​ 'స్క్రీన్​ లాక్' ఫీచర్​​.. ఇక ఛాట్స్​ మరింత భద్రం!

WhatsApp screen lock : వాట్సాప్​ 'స్క్రీన్​ లాక్' ఫీచర్​​.. ఇక ఛాట్స్​ మరింత భద్రం!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 20, 2022 11:20 AM IST

WhatsApp screen lock feature : 'స్క్రీన్​ లాక్​' పేరుతో ఓ కొత్త ఫీచర్​ను తీసుకొచ్చేందుకు వాట్సాప్​ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. వాట్సాప్​ డెస్క్​టాప్​ యూజర్ల కోసం త్వరలోనే ఇది అందుబాటులోకి రానున్నట్టు సమాచారం.

వాట్సాప్​ నుంచి కొత్త ఫీచర్​!
వాట్సాప్​ నుంచి కొత్త ఫీచర్​!

WhatsApp screen lock feature : కస్టమర్లకు కొత్తదనాన్ని ఇచ్చేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో జోరు పెంచి.. సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇక మరో కొత్త ఫీచర్​ కూడా త్వరలో అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. డెస్క్​టాప్​ యూజర్ల కోసం.. ‘స్క్రీన్​ లాక్’ అనే పేరుతో​ ఫీచర్​ను వాట్సాప్​ సిద్ధం చేస్తోందని సమాచారం.

వాట్సాప్​ ఛాట్స్​ భద్రత కోసం..

ఈ స్క్రీన్​ లాక్​ ఫీచర్​ బయటకొస్తే.. డెస్క్​టాప్​లో వాట్సాప్​ను ఓపెన్​ చేసిన ప్రతిసారీ పాస్​వర్డ్​ టైప్​ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్​తో భద్రత మరింత పెరిగినట్టు అవుతుంది. డెస్క్​టాప్​లో ఎవరైనా వాట్సాప్​ లాగిన అయ్యి.. లాగౌట్​ అవ్వడం మర్చిపోతే.. అనాథరైజుడ్​ యాక్సెస్​కు అవకాశం లేకుండా ఈ ఫీచర్​ చూసుకుంటుంది.

WhatsApp desktop new features : వాట్సాప్​కు చెందిన లేటెస్ట్​ అప్డేట్స్​ అన్ని ఇచ్చే వాబీటా ఇన్​ఫో.. ఈ స్క్రీన్​ లాక్​ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం.. ఈ వాట్సాప్​ స్క్రీన్​ లాక్​ ఫీచర్​ డెవలప్​మెంట్​ స్టేజ్​లో ఉందని పేర్కొంది. త్వరలోనే.. కొందరు బీటా టెస్టర్లకు ఈ ఫీచర్​ను వాట్సాప్​ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

నివేదికల ప్రకారం.. వాట్సాప్​ స్క్రీన్​ లాక్​ అనేది అప్షనల్​. యాప్​న​కు పాస్​వర్డ్​ ప్రొటక్షన ఇవ్వాలా? లేదా? అన్నది యూజర్ల ఇష్టం. యూజర్లు పెట్టే పాస్​వర్డ్​లు.. వాట్సాప్​కి కూడా తెలియవు. న్యూమరిక్​ పాస్​వర్డ్​తో పాటు.. ఫింగర్​ప్రింట్​ సెన్సార్​తోనూ వాట్సాప్​ స్క్రీన్​ లాక్​ను ఉపయోగించుకోవచ్చని తెలుస్తోంది.

డెవలప్​మెంట్​ స్టేజ్​లోనే ఉండటంతో.. ఈ వాట్సాప్​ స్క్రీన్​ లాక్​ ఫీచర్​పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

స్క్రీన్​ లాక్​ పాస్​వర్డ్​ మర్చిపోతే?

WhatsApp screen lock : స్క్రీన్​ లాక్​ ఫీచర్​లో పాస్​వర్డ్​ని మర్చిపోతే.. పరిస్థితేంటన్న విషయంపైనా వాబీటా.. వివరాలను వెల్లడించింది. పాస్​వర్డ్​ మర్చిపోతే.. సింపుల్​గా డెస్క్​టాప్​ నుంచి లాగౌట్​ అయ్యి, మళ్లీ లాగిన్​ అయితే సరిపోతుందని నివేదికలో ఉంది.

"పాస్​వర్డ్​ని మర్చిపోతే.. వాట్సాప్​ డెస్క్​టాప్​ నుంచి లాగౌట్​ అవ్వాలి. క్యూఆర్​ కోడ్​తో తిరిగి లాగిన్​ అవ్వాలి," అని నివేదిక పేర్కొంది.

వాట్సాప్​ పోల్​ ఫీచర్​..

WhatsApp poll feature : వాట్సాప్​ పోల్​ ఫీచర్​ను ఇటీవలే యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది మెటా ఆధారిత మెసేజింగ్​ సంస్థ. ఏదైనా విషయంపై ఇతరుల అభిప్రాయం తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఉదారహణకు ఏ విషయంపై అయినా వాట్సాప్ గ్రూప్‍లోని సభ్యుల అభిప్రాయాన్ని ఈ పోల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏదైనా ప్రశ్నను పోల్ రూపంలో గ్రూప్‍లో మెసేజ్ చేసి.. దాంట్లో ఆప్షన్లు ఇవ్చొచ్చు. దీంతో సభ్యులు ఎంపిక చేసుకున్న ఆప్షన్‍ను బట్టి ఫలితం తెలుస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner