WhatsApp Polls: వాట్సాప్‍లో ఈ ఫీచర్ అందరికీ వచ్చేసింది.. ఉపయోగమేంటి.. ఎలా వాడాలో తెలుసుకోండి-how to use whatsapp polls feature these are the benefits ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  How To Use Whatsapp Polls Feature These Are The Benefits

WhatsApp Polls: వాట్సాప్‍లో ఈ ఫీచర్ అందరికీ వచ్చేసింది.. ఉపయోగమేంటి.. ఎలా వాడాలో తెలుసుకోండి

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 17, 2022 03:16 PM IST

WhatsApp Polls: వాట్సాప్‍లో పోల్స్ ఫీచర్ యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ఉపయోగమేంటి.. ఎలా వాడాలో చూడండి.

WhatsApp Polls: వాట్సాప్‍లో ఈ ఫీచర్ అందరికీ వచ్చేసింది.. ఎలా వాడాలంటే..
WhatsApp Polls: వాట్సాప్‍లో ఈ ఫీచర్ అందరికీ వచ్చేసింది.. ఎలా వాడాలంటే.. (HT_PRINT)

WhatsApp Polls: పాపులర్ మేసేజింగ్ యాప్ వాట్సాప్ తరచూ కొత్త ఫీచర్లను తెస్తుంటుంది. యూజర్లకు నూతన సదుపాయాలు కల్పించేందుకు వీటిని తీసుకొస్తుంటుంది. ఇటీవలి కాలంలో వాట్సాప్‍కు చాలా ఫీచర్లు యాడ్ అయ్యాయి. మరిన్ని టెస్టింగ్ దశలో ఉన్నాయి. కాగా తాజాగా ఓ ఫీచర్ ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్. టెస్టింగ్ కోసం ఇంతకాలం బీటా యూజర్లకు ఇచ్చిన ఈ ఫీచర్ ను ఇప్పుడు సాధారణ యూజర్లకు కూడా అందుబాటులోకి తెచ్చింది. అదే వాట్సాప్ పోల్ ఫీచర్. ఈ ఫీచర్ కావాలంటే యూజర్లు ముందుగా యాప్ స్టోర్ లో వాట్సాప్‍ను అప్‍డేట్ చేసుకోవాలి. అప్పుడు ఈ ఫీచర్ యాడ్ అవుతుంది. అసలు వాట్సాప్ పోల్స్ ఫీచర్ ఎలా ఉపయోగపడుతుంది.. ఎలా వాడాలో ఇక్కడ చూడండి.

ట్రెండింగ్ వార్తలు

WhatsApp Polls: అభిప్రాయాలు తెలుసుకోవచ్చు

వాట్సాప్ పోల్స్.. పేరులోనే పోలింగ్ ఉంది. ఏదైనా విషయంపై ఇతరుల అభిప్రాయం తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఉదారహణకు ఏ విషయంపై అయినా వాట్సాప్ గ్రూప్‍లోని సభ్యుల అభిప్రాయాన్ని ఈ పోల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏదైనా ప్రశ్నను పోల్ రూపంలో గ్రూప్‍లో మెసేజ్ చేసి.. దాంట్లో ఆప్షన్లు ఇవ్చొచ్చు. దీంతో సభ్యులు ఎంపిక చేసుకున్న ఆప్షన్‍ను బట్టి ఫలితం తెలుస్తుంది. ఏ ఆప్షన్‍ను ఎంత మంది ఎంపిక చేసుకున్నారో కనిపిస్తుంది. గ్రూప్స్ తో పాటు వ్యక్తిగత చాట్‍లోనూ ఈ పోల్స్ ఫీచర్ పని చేస్తుంది. ఒక్క ప్రశ్నకు 12 వరకు ఆప్షన్లను ఇవ్వొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజెస్‍లో ఈ వాట్సాప్ పోల్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

WhatsApp Polls: ఎలా వాడాలి?

ఒకవేళ మీరు పాత వెర్షన్ వాట్సాప్ వాడుతుంటే.. వెంటనే అప్‍డేట్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ యూజర్లయితే గూగుల్ ప్లే స్టోర్ లో, ఐఓఎస్ యూజర్లయితే యాపిల్ స్టోర్ లో అప్‍డేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వాట్సాప్ పోల్స్ ఫీచర్ యాడ్ అవుతుంది. అనంతరం ఈ కింద స్టెప్స్ ఫాలో అవండి.

  • మీ స్మార్ట్ ఫోన్‍లో వాట్సాప్ యాప్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత ఏదైనా గ్రూప్ లేదా వ్యక్తిగత చాట్‍లోకి వెళ్లండి.
  • టెక్స్ట్ టైప్ చేసే బాక్స్ పక్కనే ఉండే అటాచ్‍మెంట్ బటన్‍పై ట్యాప్ చేయండి. ఐఓఎస్‍లో అయితే ప్లస్ (+) సింబల్‍లో ఉంటుంది.
  • అప్పుడు గ్యాలరీ, కెమెరా, కాంటాక్ట్స్, డాక్యుమెంట్స్ లాంటివి కనిపిస్తాయి. చివర్లో పోల్ (Poll) అని కనిపిస్తుంది.
  • పోల్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి, ఆస్క్ క్వశ్చన్ దగ్గర మీరు ఏం అడగాలనుకుంటున్నారో ఆ ప్రశ్నను టైప్ చేయండి. ఓటింగ్ కోసం కింద ఆప్షన్‍లను ఎంటర్ చేయండి. ఇలా ఒక ప్రశ్నకు 12 వరకు ఆప్షన్‍లను మీరు సెట్ చేసుకోవచ్చు.
  • ప్రశ్న, ఆప్షన్స్ టైప్ చేయడం పూర్తయ్యాక.. సెండ్ బటన్‍పై ట్యాప్ చేయండి. అంతే పోల్ క్రియేట్ అవుతుంది.

వాట్సాప్ పోల్స్ ఫీచర్ (Photo: WhatsApp)
వాట్సాప్ పోల్స్ ఫీచర్ (Photo: WhatsApp)
WhatsApp channel